'ఆ పోలీస్ అనుచితంగా ప్రవర్తించాడు'... కోర్టుకెక్కిన కేజ్రీ!

ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశం అయిన అంశల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి.

Update: 2024-03-23 08:30 GMT

ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశం అయిన అంశల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి. ప్రధానంగా ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం పీక్స్ కి చేరింది. ఈ సమయంలో కేజ్రీవాల్ కుటుంబాన్ని హౌస్ అరెస్ట్ చేశారని.. కేజ్రీవాల్ సెక్యూరిటీపై తమకు ఆందోళనలు ఉన్నాయని ఆప్ నేతలు ఆరోపణలు గుప్పించడం ఈ వ్యవహారానికి మరింత హీట్ జోడిస్తుంది.

ఈ సమయంలో... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు! ఇందులో భాగంగా గతంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఢిల్లీ పోలీస్ అధికారి ఏసీపీ ఏకే సింగ్.. తన విషయంలో కూడా అదేవిధంగా వ్యవహరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. తనపై కోర్టు ఆవరణలో దురుసుగా ప్రవర్తించాడని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇదే సమయంలో... అలాంటి దుష్ప్రవర్తన స్వభావం ఉన్న అతడిని తన సెక్యూరిటీ విధుల నుంచి తొలగించాలని కేజ్రీవాల్ తన పిటిషన్ లో కోరారని తెలుస్తోంది! దీంతో మరోసారి ఏసీపీ ఏకే సింగ్ వ్యవహారం వార్తల్లో నిలిచింది. ఈ సమయంలో గతంలో ఏసీపీ ఏకే సింగ్ పై మనీష్ సిసోడియా వ్యవహారంలో జరిగిన సంఘటన చర్చకు వస్తోంది.

కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా గతేడాది మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడుతున సమయంలో అతనితో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. ఈ సమయంలో మనీష్ మెడపట్టుకొని ఏకే సింగ్ అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా రికార్డ్ అవ్వడంతో... సిసోడియా లిఖిత పూర్వకంగా కోర్టుకు ఫిర్యాదు చేశారు.

దీంతో... ఏకే సింగ్ ఎలాంటి తప్పూ చేయలేదని.. సిసోడియా భద్రత కోసమే అలా వ్యవహరించారని.. నిందితులు ఎవరైనా సరే మీడియాతో మాట్లాడటం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఏకే సింగ్ పై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈసారి ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News