కుక్క కోసం హైకోర్ట్‌ కి వెళ్లిన హీరోయిన్‌..!

డబ్బున్న వారు, సెలబ్రిటీలు పెట్స్ ను పెంచుకోవడం స్టేటస్ సింబల్ గా భావిస్తూ ఉంటారు.

Update: 2024-04-13 08:40 GMT

డబ్బున్న వారు, సెలబ్రిటీలు పెట్స్ ను పెంచుకోవడం స్టేటస్ సింబల్ గా భావిస్తూ ఉంటారు. పెట్స్ పై ఇంట్రస్ట్‌ తో కొందరు వాటికి నెలకు లక్షలకు లక్షలు ఖర్చు చేయడం మనం చూస్తూ ఉంటాం. కొందరు వీధి కుక్కల కి ఫుడ్‌ పెట్టే వారు కూడా ఉంటారు. ఇలా జంతు ప్రేమికులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

అలాంటి జంతు ప్రేమికుల్లో సీనియర్‌ నటి అయేషా జుల్క ఒకరు. ఆమె వద్ద పెట్‌ డాగ్స్ ఎన్నో ఉంటాయి. వాటితో పాటు వీధి కుక్కలకు కూడా ఆమె ఆహారం అందిస్తూ వాటిని తీసుకుని వచ్చి తన పెట్స్ తో సంరక్షిస్తూ ఉంటుంది. అలా పెంచుకుంటున్న కుక్కల్లో ఒక కుక్క 2020 లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

ఆ కుక్క మరణంకు తన వద్ద పని చేసే కేర్ టేకర్‌ రామ్‌ ఆండ్రే అంటూ ఆరోపిస్తూ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కుక్క చావుకు కారణం అంటూ రామ్‌ ఆండ్రే ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కి పంపించారు. కేసు స్థానిక కోర్టులో విచారణ జరుగుతుంది.

అరెస్ట్‌ అయిన రామ్‌ ఆండ్రే కొన్ని రోజులకు బెయిల్‌ పై వచ్చాడు. కోర్టు లో ఎంతకు తుది తీర్పు రాకపోవడంతో అయేషా జుల్క అసహనం వ్యక్తం చేసింది. తప్పు చేసిన వ్యక్తి బెయిల్‌ పై తిరుగుతున్నాడు అంటూ ఆమె ఈసారి బొంబే హైకోర్టును ఆశ్రయించింది.

రామ్‌ ఆండ్రే చేసింది తప్పే అయ్యి ఉండవచ్చు కానీ అతడికి ఇప్పటికే పడాల్సిన శిక్ష పడే ఉంటుంది. అతడు తప్పు తెలుసుకుని ఉంటాడు. అయినా కూడా మీరు ఎందుకు అతడిని వెంటాడుతున్నారు, ఇప్పుడు హై కోర్టు వరకు వెళ్తున్నారు అంటూ కొందరు అయేషా ను ప్రశ్నిస్తుండగా, కొందరు మాత్రం ఆమె చర్యను సమర్ధిస్తున్నారు.

Tags:    

Similar News