బిగ్ బ్రేకింగ్... బండ్ల గణేష్ కు జైలు శిక్ష!

నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది.

Update: 2024-02-14 09:38 GMT

నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే సమయలో శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానానూ విధించింది. అదేవిధంగా ఆ జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 2019లో రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేష్ ఈ మొత్తం సొమ్ముకు చెక్ ఇచ్చారు. అయితే... ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం... జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.

కాగా... 2017లో బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. "టెంపర్" సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఆ కేసులో కూడా జైలు శిక్షతో పాటు రూ.15,86,550 జరిమానా కూడా విధించింది. ఇదే సమయంలో... రూ. 25 లక్షల సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్టు ఈ శిక్ష విధించింది.

మరోవైపు చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్.. హీరో పక్కన ఫ్రెండ్ పాత్రలు వేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రవితేజ హీరోగా "ఆంజనేయులు" సినిమాతో ప్రొడ్యూసర్‌ గా మారారు బండ్ల గణేష్! అనంతరం పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు

Tags:    

Similar News