కంగ‌న‌కు దెబ్బ మీద దెబ్బ‌..మ‌రో షాక్!

`ఎమ‌ర్జెన్సీ` రిలీజ్ విష‌యంలో బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటుందో తెలిసిందే.

Update: 2024-09-18 10:42 GMT

`ఎమ‌ర్జెన్సీ` రిలీజ్ విష‌యంలో బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటుందో తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో సినిమా విడుద‌ల చేయ‌నివ్వ‌మ‌ని బెదిరిస్తుంటే? మ‌రికొంత మంది దుండ గులు ఏకంగా కంగ‌న‌ని చంపేస్తామ‌నే బెదిరించారు. దీనికి తోడు సెన్సార్ బృందం సైతం సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. చాలా స‌న్నివేశాలు వివాదాస్ప‌దంగా ఉన్నాయ‌ని భావించిన సెన్సార్ ఇవ్వ‌లేమంటూ చెప్పింది.

దీంతో కంగ‌న సెన్సార్ కోసం పోరాటం చేస్తోంది. సినిమా రిలీజ్ కి సెన్సార్ అడ్డుగా మారింది. అది క్లియ‌ర్ అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా? ఫేస్ చేయ‌డానికి సిద్దంగా ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చండీగఢ్ లోని ఓ జిల్లా కోర్టు కంగనకు నోటీసులు జారీ చేసింది. జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది రవీందర్ సింగ్ బస్సి ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు.

`ఎమర్జెన్సీ` సినిమాలో సిక్కుల ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం కంగన చేసిందని తన పిటిషన్ లో రవీందర్ సింగ్ ఆరోపించారు. సిక్కులను కించపరిచేలా చూపించడమే కాకుండా, సిక్కు సామాజికవర్గంపై అసత్య ఆరోపణలు చేశారని ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కంగనకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న స‌మ యంలో విధించిన `ఎమర్జెన్సీ` ఆధారంగా చేసుకుని కంగ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ వివాదాలు..సెన్సార్ అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌వ్వ‌డంతో రిలీజ్ వాయిదా ప‌డుతుంది.

Tags:    

Similar News