ఇళయరాజా పాటల క్రియేటివిటీ దోపిడీ కేసులో హైకోర్టు తీర్పు
ఇళయరాజా 4,500 పాటలకు సంబంధించిన వాణిజ్య హక్కులపై హైకోర్టులో విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇళయరాజా 4,500 పాటలకు సంబంధించిన వాణిజ్య హక్కులపై హైకోర్టులో విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. హక్కులు కొనుగోలు చేసిన కంపెనీకి చెందాతాయా? క్రియేటర్ కి చెందాతాయా? అన్న కోణంలో తాజా విచారణ సాగింది. క్రియేటివిటీని ఎవరు దోపిడీ చేస్తున్నారు? అన్నదానిపై కోర్టు భిన్నంగా స్పందించింది.
మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన 4,500కు పైగా సినిమా పాటలను వాణిజ్యపరమైన దోపిడీకి పాల్పడడం, పాటలపై ఆయనకున్న హక్కును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ ఫలితానికి లోబడి ఉంటుందని మద్రాస్ హైకోర్టు బుధవారం తెలిపింది. జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. పాటలపై హక్కును క్లెయిమ్ చేస్తూ ఎకో రికార్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, సాహిత్యం లేకుండా పాటలకు అంత విలువ ఉండదని బెంచ్ గమనించినట్టు పేర్కొంది. ఇళయరాజా సంగీత కూర్పుపై మాత్రమే తన వాదనను పరిమితం చేస్తారా? పాటల రచయిత కూడా ఒకవేళ కాపీ రైట్, రాయల్టీ కోరితే? అని ఆశ్చర్యపోయింది. దీనికి, గీత రచయితకు రాయల్టీ అందుతుందని సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్ సమర్పించారు.
పాటలను స్వరకర్త లేదా నిర్మాత వాణిజ్యపరంగా దోపిడీ చేసినప్పటికీ... ఎకో రికార్డింగ్ ప్రకారం, కాపీరైట్‌ల చట్టం ప్రకారం కూడా అలాంటి హక్కు దఖలు పరచనప్పటికీ నిర్మాతకు మాత్రమే వీటిపై హక్కు ఉంటుందని జడ్జి తెలిపారు. భారతదేశంలో సంగీత దర్శకులు సినిమా నిర్మాత నుండి తమ పనికి పారితోషికం అందుకున్న తర్వాత పాటలపై వారి హక్కును కోల్పోతారు. వారు రాయల్టీని పొందవచ్చు కానీ వారి కంపోజిషన్‌లపై ప్రత్యేక హక్కులను క్లెయిమ్ చేయలేరని కంపెనీ పేర్కొంది. కంపెనీ నిర్మాతల నుండి 4,500 పాటల హక్కులను కొనుగోలు చేసింది. 2014 వరకు వాటిని ఎకో సంస్థ వాణిజ్యపరంగా దోపిడీ చేసిందని సంగీత దర్శకుడు ఇళయరాజా హైకోర్టును ఆశ్రయించారు. క్రియేటివిటీకి కాపీ రైట్స్ ఉంటాయనేది ఇళయరాజా తరపు న్యాయవాది వాదన. కానీ దీనిని కోర్టు తిరస్కరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఉపయోగించి ఇళయరాజా 4,500 పాటలకు మరో సంగీత సంస్థకు లైసెన్స్ ఇచ్చారు. ఇప్పుడు, ఇళయరాజా ఎకో రికార్డింగ్ ..ఇతర కంపెనీ రెండింటి నుండి రాయల్టీని పొందుతున్నారని కంపెనీ తరపు న్యాయవాది ఆరోపించారు.