కేరళ కోర్టు సంచలన తీర్పు.. ప్రియుడిని చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష
కేరళలోని ఓ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది.
కేరళలోని ఓ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఈ హత్యలో సహకరించిన మామకు మూడేళ్ల జైలు శిక్షను విధించింది కోర్టు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేరళకు చెందిన శరన్ (23), గ్రీష్మ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరంటే ఎంతో ఇష్టం. చాలా ఏళ్లపాటు కలిసే ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా గ్రేష్మాలో మార్పు వచ్చింది. శరన్‌తో ఉన్న రిలేషన్‌ను ముగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని శరన్‌కు కూడా చెప్పింది. ఇప్పటివరకు కలిసి ఉన్నది చాలని.. ఇద్దరం విడిపోదామని వెల్లడించింది.
అయితే.. ఈ విషయాన్ని శరన్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ఎంతగానో ప్రేమించిన గ్రీష్మ నుంచి విడిపోయేందుకు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయేందుకు ఇష్టపడనని గ్రీష్మకు స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ శరణ్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న గ్రీష్మ పూర్తిగా తప్పించాలని భావించింది. శాశ్వతంగానే లేకుండా చేయాలని నిర్ణయించిన గ్రీష్మ.. పెస్టిసైడ్ కలిపిన డ్రింక్‌ను శరణ్‌తో తాగించి చంపేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదయింది. అప్పట్లోనే గ్రీష్మకు కఠిన శిక్ష పడుతుందని అంతా భావించారు.
2022లో గ్రీష్మ వయసు 22 సంవత్సరాలు అని, చిన్న వయసు దృష్ట్యా శిక్ష తగ్గించాలని లాయర్ విన్నవించారు. దీనిపై మళ్లీ వాదనలు జరగడంతో అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు రేష్మకు ఉరి శిక్షను ఖరారు చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రూరమైన నేరం, సాక్ష్యాలు చెరిపేసే ప్రయత్నం చేయడం, దర్యాప్తును తప్పుదోవ పట్టించిన ఆమె వయసును మాత్రం పరిగణలోకి తీసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఘోరమైన నేరానికి పాల్పడిన నేపథ్యంలో ఆమెకు ఉరి శిక్ష ఖరారు చేస్తూ తీర్పును ఇచ్చారు. ఈ తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.