బ్రేకింగ్... హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబు!
మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో మంటలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా మంగళవారం మోహన్ బాబు నివాసం వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సమయంలో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు.
అవును.. మోహన్ బాబు ఇంటివద్ద మంగళవారం రాత్రి జరిగిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. లోనికి వెళ్లకుండా మనోజ్ ను అడ్డుకోవడం, బలవంతంగా గేట్లు నెట్టుకుని లోనికి వెళ్లిన అనంతరం చినిగిన చొక్కాతో బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
మరోపక్క మోహన్ బాబు సమక్షంలో మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. స్వయంగా మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారనే చర్చా జరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సీపీ కార్యాలయానికి హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
దీంతో... తనకు పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ.. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను మోహన్ బాబు తరుపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు.
మరోపక్క... రాచకొండ సీపీ ఎదుట మంచు మనోజ్ విచారణకు హాజరుకానున్నారని తెలుస్తోంది. మంచు విష్ణు హాజరు వ్యవహారం తెలియాల్సి ఉంది. కాగా.. జల్ పల్లి లోని నివాసం వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.