మసీదు లోపల 'జై శ్రీరామ్' నినాదాలు... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
మసీదు లోపల 'జై శ్రీరామ్' నినాదాలు చేసినందుకు ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు మోపపడ్డాయి.
మసీదు లోపల 'జై శ్రీరామ్' నినాదాలు చేసినందుకు ఇద్దరు వ్యక్తులపై అభియోగాలు మోపపడ్డాయి. అయితే దీనికి సంబంధించిన క్రిమినల్ ప్రొసీడింగ్ లను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఇది ఏ వర్గానికి చెందిన మతపరమైన భావాలను ఉల్లంఘించలేదని పేర్కొంది! ఈ సందర్భంగా సెక్షన్ 295ఏ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది!
అవును... మసీదులోపల 'జై శ్రీరామ్' నినాదాలు చేసినందుకు అభియోగాలు మోపబడిన ఇద్దరు వ్యక్తులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతంలో హిందూ-ముస్లింలు సామరస్యపూర్వకంగా జీవిస్తున్నారంటూ ఫిర్యాదుదారు పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది!
వివరాళ్లోకి వెళ్తే... దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు గత ఏడాది సెప్టెంబర్ లో ఒక రాత్రి స్థానిక మసీదులోకి ప్రవేశించి 'జై శ్రీరామ్' అని నినాదాలు చేశారు. దీంతో వీరిపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295ఏ (మత విశ్వాసాలను దెబ్బతీయడం), 447 (నేరపూరిత అపరాధం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో తమపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తన వాదనలు వినిపించిన వీరి తరుపు న్యాయవాది... మసీదు అనేది పబ్లిక్ ప్లేస్ అని, అందువల్ల క్రిమినల్ అతిక్రమణ కేసు లేదని వాదించారు. 'జై శ్రీరామ్' అని అరవడం సెక్షన్ 295ఏ నిర్వచించిన నేరం అవసరాన్ని తీర్చలేదని అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన కర్ణాటక ప్రభుత్వం పిటిషనర్... ఈ విషయంలో తదుపరి దర్యాప్తు అవసరమని.. వారిని కస్టడీకి ఇవ్వాలని కోరారు! దీంతో... ఐపీసీ సెక్షన్ 295ఏని పరిగణలోకి తీసుకుంటూ జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ తన ఆర్డర్ లో ఇలా పేర్కొంది.
సెక్షన్ 295ఏ ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యను వ్యవహరిస్తుంది.. వారి మతం, మత విశ్వాసాలను అవమానించడం ద్వారా ఏ వర్గానికి చెందిన మతపరమైన భావాలను ఆగ్రహానికి గుర్తి చేస్తుంది.. ఇది అర్ధం చేసుకోలేనిది అని అన్నారు. "జై శ్రీరామ్ అని అరిస్తే అది ఏ వర్గానికి చెందిన వారి మతపరమైన భావాన్ని ఉల్లంఘిస్తుంది?" అని ప్రశ్నించారు!
ఇదే సమయంలో ఈ ప్రాంతంలో హిందూ - ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని ఫిర్యాదుదారు స్వయంగా పేర్కొన్నప్పుడు ఈ సంఘటన ఊహకు అందకుండా పోతుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఈ పిటిషన్ ను అనుమతించిన హైకోర్టు ట్రయల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్ లను రద్దు చేసింది!