మతిస్థిమితం లేని వారితో శృం8గారంపై కోర్టు కీలక వ్యాఖ్య!
మతిస్థిమితం సరిగా లేని మహిళల సమ్మతితో చేసే శృం*గారాన్ని కూడా అత్యాచారంగానే పరిగణించాలంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
మతిస్థిమితం సరిగా లేని మహిళల సమ్మతితో చేసే శృం*గారాన్ని కూడా అత్యాచారంగానే పరిగణించాలంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవును... మానసిక వైకల్యంతో బాధపడేవారు ప్రకృతి, పర్యావసానాలు అర్థం చేసుకోలేరని అభిప్రాయపడిన ముంబైలోని సెషన్స్ కోర్టు... మతిస్థిమితం సరిగా లేని మహిళలతో శృం*గారం సమ్మతితో జరిగినప్పటికీ అది అత్యాచారంగానే పరిగణించాలని తెలిపింది.
అవును... తన పక్కింటిలో ఉంటున్న మతిస్థిమితం లేని మహిళ (23)తో ఆమె అంగీకారం మేరకే ఓ 24 ఏళ్ల యువకుడు శృం*గారం చేశాడు. ఫలితంగా.. ఆమె గర్భం దాల్చింది. దీంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. దీంతో.. ఈ కేసులో ఆ యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది.
జనవరి 9, 2019న కురార్ పోలీస్ స్టేషన్ లో ఆ బాదిత మహిళ తల్లి నమోదు చేసిన కేసు వివరాల ప్రకారం.. వైద్య పరీక్షలో బాధితురాలు మూడు నెలల గర్భవతి అని తేలిందట. నాలుగు నెలల క్రితం కిరాణా షాపుకు వెళ్లిన సమయంలో... సమీపంలోని సెలూన్ లో పనిచేస్తున్న నిందితుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడట.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై స్పందించిన కోర్టు... ఆమె మానసిక వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. సమ్మతి అసంబద్ధం అని వ్యాఖ్యానించింది! ఈ నేపథ్యంలో... చట్టం ప్రకారం నిందితుడే అత్యాచారం చేసినట్లు చెప్పవచ్చని తెలిపింది! మానసిక వికలాంగురాలు చట్టబద్ధంగా సమ్మతి ఇవ్వదని.. దాని ప్రభావం గురించి తప్పనిసరిగా అవగాహన ఉండదని తెలిపింది.
ఇదే సమయంలో... నిందితుడు తనను బలవంతంగా ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడని బాదితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆ వ్యక్తి తనకు ఇష్టమని, అతడితో పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. అయితే అందుకు తన తల్లిదండ్రులు అనుమతించలేదని ఆమె అంగీకరించింది.
అంతేకాకుండా.. తాను గర్భవతి అయిన విషయం కూడా అతనికి చెప్పలేదని కూడా ఆమె అంగీకరించిందని తెలుస్తుంది. దీంతో... మహిళ మాటల ఆధారంగా.. ఇద్దరూ ఏకాభిప్రాయంతో సంబంధం కలిగి ఉన్నారని, మహిళ మానసికంగా సవాలు చేయలేదని డిఫెన్స్ లాయర్ పేర్కొన్నారు. అయితే ఆ వాదనను కోర్టు తోసిపుచ్చింది. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.