నాగార్జున పిటీష‌న్ పై విచార‌ణ వాయిదా!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంమైన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-04 07:47 GMT

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంమైన సంగ‌తి తెలిసిందే. సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు దిగారు. నాపంల్లి కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేసారు. అయితే న్యాయ‌మూర్తి సెల‌వులో ఉండ‌టంతో విచార‌ణ వాయిదా ప‌డింది. సోమ‌వారం దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే సురేఖ వ్యాఖ్య‌ల్ని నాగార్జున వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు.

ఈ నేప‌థ్యంలో సురేఖ ఆ వ్యాఖ్య‌ల్ని కొన్ని గంట‌ల్లోనే వెన‌క్కి తీసుకున్నారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే తన ఉద్దేశ్యమని సురేఖ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. సమంత మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని సమంతను ఉద్దేశించి సురేఖ ట్వీట్ చేశారు. స్వయం శక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శప్రాయమన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంతగానీ, సమంత అభిమానులుగానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించు కుంటున్నానని సురేఖ పోస్ట్ చేశారు.

దీంతో సోమ‌వారం విచార‌ణ నేప‌థ్యంలో న్యాయమూర్తి ఎలా స్పందిస్తారు? సురేఖ వ్యాఖ్య‌ల్ని వెన‌క్కి తీసుకోవ‌డం కోర్టు ఎంత ఫ‌రిది వ‌ర‌కూ తీసుకుంటుంది? అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఇప్ప‌టికే సురేఖ వ్యాఖ్య‌ల్ని చిత్ర యావ‌త్ ప‌రిశ్ర‌మ ఖండించిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌కీయాల్లోకి సినిమా న‌టుల్ని లాగ‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం..ఆ వ్యాఖ్య‌లు ఆమె ప‌ద‌వికి క‌ళ‌కం తెచ్చేలా వ్యాఖ్యానించార‌ని మండిప‌డ్డారు. ఇండ‌స్ట్రీ పెద్దల‌తో స‌హా న‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లంతా స్పందిచి త‌మ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆధారాలు లేకుండా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు.

Tags:    

Similar News