సద్గురు ఈశా ఫౌండేషన్ కేసు.. కోర్టు కీలక వ్యాఖ్యలు.. రంగంలోకి పోలీసులు!
ఈ సమయంలో మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో భారీ సంఖ్యలో పోలీసులు రంగప్రవేశం చేశారు.
కోయంబతూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వస్తునాయి. ఈ సమయంలో ఈ వ్యవహారం ఓ తండ్రి ఫిర్యాదుతో కోర్టుకు చేరింది. ఈ సమయంలో మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో భారీ సంఖ్యలో పోలీసులు రంగప్రవేశం చేశారు.
అవును... ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంపై కోయంబత్తూరు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో... తన ఇద్దరు కుమార్తెలు ఈశా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారని తెలిపారు.
ఈ సందర్భంగా తమను ఇబ్బందికి గురుచేయకూడంటూ కుమర్తెలు తమపై సివిల్ కేసు వేసి.. తనను, తన భార్యను మానసికంగా ప్రభావితం చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ తమ కుమార్తెలను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఇక ఈశా కేంద్రానికి వ్యతిరేకంగా తాము ఏమైనా ఆందోళన చేస్తే.. చనిపోయే వరకూ నిరాహార దీక్ష చేస్తానని తమ రెండో కుమార్తె తెలిపిందని అన్నారు.
ఈ కేసు జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ శివజ్ఞానం ఎదుట విచారణకు వచ్చింది. ఈ సమయంలో ఇద్దరు కుమార్తెలనూ హాజరుపరిచారు. ఈ సమయంలో జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసిన ఫోటో చూసిన న్యాయమూర్తులు... ఇతరుల పిల్లలను మాత్రం సన్యాసులుగా ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... ఈ వ్యవహారంలో పలు అనుమానాలున్నాయని.. ఈశా యోగా కేంద్రంపై ఇప్పటివరకూ ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి వివరాలు దాఖలు చేయాలని పోలీసులకు ఉత్తర్వ్యులు ఇచ్చి, విచారణను వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో కోవై జిల్లా ఏస్పీ కారికేయన్, సాంఘిక సంక్షేమశాఖ అధికారిని అంబిక నేతృత్వంలో సుమారు 150 మంది పోలీసు బెటాలియన్.. ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఈ కేంద్రంలో బస చేసిన వారి వివరాలు.. అందులో మహిళలు, విదేశీలు ఎంతమంది ఉన్నారు అనే వివరాలను సేకరిస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో... ఆ ఆశ్రమమంలో ఇప్పటివరకూ అదృశ్యమైన వారు, మృతి చెందిన వారి వివరాలనూ పోలీసు అధికారులు సేకరిస్తున్నారని సమాచారం.