క్యాంపస్ లో హిజాబ్... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

కాలేజీ క్యాంపస్ లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్.జీ. ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే

Update: 2024-08-09 11:33 GMT

కాలేజీ క్యాంపస్ లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్.జీ. ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. హిజాబ్, బుర్కా, నఖాబ్ లకు క్యాంపస్ లో అనుమతి లేదని తెలిపింది! అయితే.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేసింది. ఈ సందర్భంగా ఈ సర్క్యులర్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవును... క్యాంపస్ లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కాలేజీ ఇచ్చిన సర్యులర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా.. మతపరమైన గుర్తింపు హిజాబ్ తోనే కాదన్నట్లుగా... విద్యార్థుల పేర్లతో కూడా వారి మతమరమైన గుర్తింపు బయటపడట్లేదా అని ప్రశ్నించింది. ఇదే క్రమంలో... అమ్మాయిలకు వారు ధరించే దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడింది.

ఇదే క్రమంలో... వారు ధరించే దుస్తులను ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండాలని.. ఈ విషయంలో కళాశాలలు వారిని బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే సమయంలో... దేశంలో అనేక మతాలు ఉన్నాయని చెబుతూ... వారి మతపరమైన గుర్తింపు విద్యార్థుల పేర్లతోనే బయటపడటం లేదా?.. అలాగని ఇకపై విద్యార్థులను నంబర్లతో పిలిస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇదే సమయంలో... క్యాంపస్ లో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపిన సుప్రీంకోర్టు... ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే సదరు విద్యా సంస్థ కోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పించింది. అనంతరం దీనిపై నోటీసులు జారీ చేస్తూ నవంబర్ 18లోగా తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

కాగా... క్యాంపస్ లో హిజాబ్, నిఖాబ్, బుర్కా, క్యాప్ వంటివి వాటిని ధరించకూడదంటూ ముంబైలోని ఎన్.జీ. ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల ఓ సర్క్యులర్ జారీ చేసింది. అయితే.. దీన్ని సవాల్ చేస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే... ఈ సందర్భంగా కాలేజీ తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.

దీంతో... హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం పై విధంగా రియాక్ట్ అయ్యింది.

Tags:    

Similar News