పూజా ఖేడ్కర్ కు ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం.. సంచలన నిర్ణయం!

పూణెలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-07 15:35 GMT

పూణెలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు.. యూపీఎస్సీ లో తప్పుడు అఫిడవిట్ డాక్యుమెంట్స్ సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో కేంద్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

అవును... మాజీ ఐఏఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ వ్యవహారం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమె విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఐఏఎస్ (ప్రొబెషన్) రూల్స్ - 1954 ప్రకారం పూజా ఖేడ్కర్ పై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో... ఈ తాజాగా నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని సదరు వర్గాలు తెలిపాయి.

కాగా... పూజా ఖేడ్కర్ వ్యవహారంపై గతంలో యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (యూపీఎస్సీ) దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై వస్తోన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఆమెకు షోకాస్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

దీంతో... చర్యలకు ఉపక్రమించిన యూపీఎస్సీ.. ఆమె ప్రొబిషనల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. దీనిపై పూజా ఖేడ్కర్ హైకోర్టును ఆశ్రయించింది. తాను ఏ పత్రాలనూ ఫోర్జరీ చేయలేదని తెలిపింది. యూపీఎస్సీ చేసిన ఆరోపణలను తోసి పుచ్చింది! ఇదే సమయంలో తనపై అనర్హత వేటు వేసే అధికారం యూపీఎస్సీకి లేదని వాదించారు!

ఇదె క్రమంలో... డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు మాత్రమే ఆల్ ఇండియా సర్వీసుల చట్టం కింద చర్యలు తీసుకునే వీలు ఉందని వాదించారు. ఈ నేపథ్యంలోనే... ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల నుంచి తొలగిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది.

Tags:    

Similar News