బిగ్ బ్రేకింగ్... ఆర్జీవీ పిటిషన్ పై హైకోర్టులో కీలక పరిణామం!

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసుల వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-28 08:13 GMT

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలో నమోదైన కేసుల వ్యవహారం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వరుసగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికె మద్దిపాడు స్టేషన్ లో నమోదైన కేసుల వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. తాజాగా వేసిన పిటిషన్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... అర్జీవీపై ఏపీలో వరుసగా పోలీస్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.ఈ సమయంలో వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఎక్స్ లో తాను పెట్టిన పోస్టుపై అనేక కేసులు నమోదు చేస్తున్నారని.. ఒక విషయంపై ఇన్ని కేసులు పెట్టడం సమంజసం కాదని ఆర్జీవీ పిటిషన్ లో పేర్కొనారు.

ఇదే సమయంలో సోషల్ మీడియా పోస్టులపై తనపై ఇప్పటివరకూ నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఆర్జీవీ కోరారు! దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో... కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. మరోపక్క.. ఆర్జీవీ ఇప్పటికె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా... వ్యూహం సినిమా ప్రమోషన్ టైం లో చంద్రబాబు, లోకేష్, పవన్ లపై వర్మ అసహ్యకరంగా పోస్టులు పెట్టరంటూ టీడీపీ నేత రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో సుమారు ఏడు సెక్షన్స్ కింద కేసు నమొదైంది!

ఈ సమయంలో విచారణకు రావాలంటూ వర్మకు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కోసం పోలీసులు ఆరు బృందాలుగా మూడు ప్రాంతాల్లో వెతుకున్నట్లు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. పోలీసులు అని చోట్లా వెతికారు కానీ "ఆర్జీవీ డెన్" కి రాలేదంటూ ఆయన కామెంట్ చేశారు!

Tags:    

Similar News