ర‌ష్యాలో అలా చేస్తే.. ఇక అంతే: పుతిన్ తెచ్చిన‌ చ‌ట్టం

ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్‌జెండర్లుగా మారాలనుకునే వారికి ఈ చ‌ట్టం వర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది

Update: 2023-07-25 10:16 GMT

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ .. ఒక‌వైపు ఉక్రెయిన్‌పై యుద్ధంలో తీరిక లేకుండా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, అదేస‌మ‌యంలో దేశంలో పెరిగిపోతున్న స్వలింగ సంపర్కుల‌పైనా.. ఆయ‌న దృష్టి పెట్టారు. అంతేకాదు.. ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపారు. ఎవ‌రైనా స్వ‌లింగ సంపర్కం కోసం ఆప‌రేష‌న్లు చేయించుకుంటే.. వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న చట్టం చేశారు.

వాస్త‌వానికి ర‌ష్యాలో లింగ‌మార్పిడి ఆప‌రేష‌న్ల‌పైనా ఆయ‌న నిషేధం విధించారు. ఈ మేర‌కు తాజాగా ఓ చ‌ట్టం తీసుకువ‌చ్చారు. దీనికి ర‌ష్యా పార్ల‌మెంటు కూడా ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం.. లింగ‌త్వంలో ఎలాంటి లోపాలు లేన‌ప్పుడు.. ప‌ర‌స్ప‌ర ఆక‌ర్ష‌ణ‌ల విష‌యంలో(ఆడ‌-మ‌గ‌) తేడా లేన‌ప్పుడు.. లింగ‌మార్పిడి చేయించుకునేందుకు చ‌ట్టం అనుమ‌తించ‌దు.

అంతేకాదు.. ఇలా చ‌ట్టాన్ని అతిక్ర‌మించి చేయించుకుంటే.. వారికి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌దు.

ఉద్దేశపూర్వకంగా ట్రాన్స్‌జెండర్లుగా మారాలనుకునే వారికి ఈ చ‌ట్టం వర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ బిల్లు ఆమోదానికి ఉభయ సభలు ఏకగ్రీవంగా సమ్మతించాయి. ఉద్దేశపూర్వకంగా లింగ మార్పిడికి సిద్ధమైన వారికి ఎలాంటి వైద్య చికిత్స అందించకూడదని చట్టం పేర్కొంది.

పబ్లిక్‌ రికార్డుల్లో, అధికారిక పత్రాల్లో జెండర్‌ను మార్చడానికి వీలు లేకుండా దీన్ని రూపొందించారు. అయితే, పుట్టుకతో లింగపరమైన సమస్యలున్న వారికి ఈ చట్టం వర్తించదు. వారికి వైద్య సహాయం అందించవచ్చని పేర్కొంది.

Similar News