ట్రెండింగ్... జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు తీవ్ర చర్చనీయాంశం అనే సంగతి తెలిసిందే.

Update: 2024-11-12 06:59 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు తీవ్ర చర్చనీయాంశం అనే సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం మరో బెంచ్ కు మార్చింది.

అవును... అత్యంత హాట్ టాపిక్స్ లో ఒకటైన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా జగన్ బెయిల్ ను రద్దు చేయాలని.. విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషిన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్ కు మార్చింది.

దీనిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ పిటిషన్లపై విచారణ బెంచ్ ను మారింది. వాస్తవానికి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభం కాగానే... ఇవి ఏపీకి చెందినవి అని జగన్ తరుపు న్యాయవాది రంజిత్ కుమార్ న్యాయస్థానానికి తెలిపారు.

ఇదే సమయంలో... మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ నేపథ్యంలో... సీజేఐ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ సంజయ్ కుమార్... "నాట్ బిఫోర్ మీ" అనడంతో రఘురామ వేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజేఐ బైదిలీ చేసారు.

దీంతో.. ఇకపై ఈ పిటిషన్లను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. వీటిని డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని సీజేఐ ఆదేశించారు!

Tags:    

Similar News