"లవర్స్ మధ్య కిస్, హగ్గ్ సహజం!".. హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!
టీనేజ్ లో ప్రేమ వ్యవహారం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేదా ముద్దు పేట్టుకోవడం చాలా సహజమని..
తనతో ప్రేమ వ్యవహారం నడిపిన వ్యక్తి.. తనను కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నాడని ఆరోపిస్తూ 21 ఏళ్ల యువకుడిపై 19 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. తాము ప్రేమలో ఉన్నప్పుడు 2022 నవంబర్ లో ఓ రోజు రాత్రి తాము ఇద్దరం కలుసుకున్నామని.. అయితే ఆ సమయంలో సదరు యువకుడు తనను ముద్దులు పెట్టుకున్నాడని, హగ్ కూడా చేసుకున్నాడని ఫిర్యాదు చేసింది.
దీంతో... పోలీసులు ఐపీసీ 354-ఏ(1)(i) కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... టీనేజ్ ప్రేమను నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసును ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు ఇచ్చింది.
అవును... జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా తీర్పు చెప్పింది! ఇది ఐపీసీ సెక్షన్ 354-ఎ(1)(i) ప్రకారం నేరానికి అర్హమైనది కాదని పేర్కొంది. ఈ సందర్భంగా... ఇద్దరూ కూడా యుక్తవయసు చివరిలో ఉన్నారని.. ఇష్టపూర్వకంగా కలుసుకున్నారని.. కలిసి గడిపారని కోర్టు పేర్కొంది!
ఇదే సమయంలో... ఆరోపించిన చర్యల్లో నేరపూరిత ఉద్దేశ్యం కన్నా.. యువ జంట విలక్షణమైన ప్రేమను ప్రతిబింబిస్తున్నాయని జస్టిస్ వెంకటేష్ పేర్కొన్నారు! టీనేజ్ లో ప్రేమ వ్యవహారం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేదా ముద్దు పేట్టుకోవడం చాలా సహజమని.. ఇది ఐపీసీ సెక్షన్ 354-ఏ(1)(i) ప్రకారం నేరంగా పరిగణించబడదని జస్టిస్ వెంకటేష్ తెలిపారు!