మైనర్ తో రిలేషన్ అత్యాచార నేరమే.. తేల్చేసిన ఢిల్లీ కోర్టు
కీలక అంశంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు. మైనర్ తో సంబంధం గురించి విస్పష్టంగా చెప్పిన అంశాలు ఇప్పటికే పలు కోర్టు చెప్పిన సంగతి తెలిసిందే.
కీలక అంశంపై స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు. మైనర్ తో సంబంధం గురించి విస్పష్టంగా చెప్పిన అంశాలు ఇప్పటికే పలు కోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఇష్టపూర్వకంగా మైనర్ తో రిలేషన్ కలిగి ఉండటానని తప్పు పట్టింది. ఒక కేసుకు సంబంధించిన విచారణలో ఈ అంశాన్ని తేల్చి చెప్పింది. ఢిల్లీ హైకోర్టు ఎదుట ఒక కేసు వచ్చింది. అందులో పద్నాలుగేళ్ల బాలిక గర్భం దాల్చింది.
దానికి కారణమైన వ్యక్తిని దోషిగా నిర్దారిస్తున్నట్లుగా న్యాయమూర్తి తేల్చారు. ఈ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి అమిత్ సహ్రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి సమ్మతితోనే శారీరక సంబంధం ఉన్నప్పటికీ.. మైనర్ బాలికతో శారీరక సంబంధాన్ని కొనసాగించటం అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పింది.
2015 జనవరిలో ఈ కేసు నమోదైంది. దీనిపై విచారణ తుది దశకు చేరకుంది. పద్నాలుగేళ్ల బాలిక గర్భం దాల్చటం.. ఆ బిడ్డకు సంబంధించిన డీఎన్ఏ పరీక్ష చేయగా నిందితుడి డీఎన్ఏ తో మ్యాచ్ అయ్యింది. దీంతో.. మైనర్ తో శారీరక సంబంధాన్ని కలిగి ఉండటం తీవ్రమైన నేరగా పేర్కొంది. తీర్పు వెలువడాల్సి ఉంది.