పబ్లిక్ న్యూసెన్స్ కేసు... సీఎంకి 10వేలు ఫైన్!

అయితే అనంతరం కేసును కొట్టివేయాలని సిద్ధరామయ్య పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది.

Update: 2024-02-07 07:02 GMT

రాజకీయంగా పదవుల్లో ఉన్నవారిపై కేసులు నమోదవ్వడం, వాటిపై విచారణలు జరగడం, అనంతరం వాటిపై శిక్షలు / జరిమానాలు పడటం అత్యంత అరుదుగా జరుగుతాయని, అసలు అక్కడివరకూ వ్యవహారం రాదనే ఒక అభిప్రాయం సామాన్య ప్రజానికంలో ఉందని అంటుంటారు! అయితే... ఇలాంటి అరుదైన ఘటన తాజాగా పక్కరాష్ట్రంలోనే జరిగింది. ఈ సందర్భంగా సీఎం 10వేలు ఫైన్ కట్టాలని కోర్టు తెలిపింది.

అవును... ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సర్కార్ ని గద్దె దింపి గ్యారెంటీలను రంగంలోకి దింపి అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టి! దీంతో సిద్ధరామయ్య సీఎం అయ్యారు. అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసిన ఒక నిరసన కార్యక్రమం కారణంగా నమోదైన కేసులో తాజాగా హైకోర్టు ఆయనపై ఫైన్ వేసింది. తదుపరి విచారణకు కూడా హాజరుకావాలని తెలిపింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... 2022లో సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్య వ్యవహారం తీవ్ర దుమారం రేపింది! దీంతో... అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మైపై ప్రతిపక్ష నేతగా ఉన్న సిద్ధరామయ్య నిరసన తెలిపారు. ఇందులో భాగంగా తన తోటి కార్యకర్తలతో కలిసిన ఆయన... సీఎం నివాసం వద్ద రోడ్డును దిగ్బంధించారు. దీంతో... పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు.

అయితే అనంతరం కేసును కొట్టివేయాలని సిద్ధరామయ్య పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ సమయంలో ఆయనకు రూ. 10,000 జరిమానా విధించడంతోపాటు.. మార్చి 6న ఎమ్మెల్యే/ఎంపీ ప్రత్యేక కోర్టుకు కూడా హాజరు కావాలని ఆదేశించింది. ఇలా ఒక పబ్లిక్ న్యూసెన్స్ కేసులో 10,000 రూపాయల జరిమానా చెల్లించాలని కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది.




 


Tags:    

Similar News