కఠిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోం.. తేల్చేసిన అత్యున్నత న్యాయస్థానం

దీనిపై స్పష్టత ఇచ్చిన ధర్మాసనం తాము చేసిన పరుష వ్యాఖ్యల్ని తొలగించమని తేల్చేశారు.

Update: 2024-09-27 04:53 GMT

దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేపిన బిల్కిస్ బానో రేప్ ఉదంతం.. కుటుంబ సభ్యుల హత్య కేసుకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వ (బీజేపీ అధికారంలో ఉంది) ప్రతిష్ట ఎంత దారుణంగా దెబ్బ తిందో తెలిసిందే. ఈ ఇష్యూ కేంద్రంలోని మోడీ సర్కారు మీదా ప్రభావాన్ని చూపింది. ఆయన పాలనపై పడిన మచ్చల్లో బిల్కిస్ బానో ఒకటి. ఇదిలా ఉండగా.. ఈ కేసు విచారణ వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం అప్పట్లో సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఇది పెను సంచలనంగా మరాింది.

అంతేకాదు.. బిల్కిస్ బానో రేప్.. ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులుగా నిరూపితమైన వారి శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం తప్పు పట్టింది. ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీం ధర్మాసనం చేసిన పరుష వ్యాఖ్యల్ని మరోసారి రివ్యూ చేయాలంటూ గుజరాత్ రాష్ట్రప్రభుత్వం కోరింది.

దీనిపై స్పష్టత ఇచ్చిన ధర్మాసనం తాము చేసిన పరుష వ్యాఖ్యల్ని తొలగించమని తేల్చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బీవీ నాగరత్న.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ల ధర్మాసనం తోసిపుచ్చింది. అంతేకాదు.. ఈ అంశంపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ లో పస లేదని స్పష్టం చేసింది. గత తీర్పు సందర్భంగా తాము చేసిన వ్యాఖ్యానాల్లో ఎలాంటి తప్పు లేదన్న కోర్టు.. గత తీర్పును రివ్యూ చేయాల్సిన అవసరం లేదని తేల్చింది.

దోషుల రెమిషన్ పై నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్ కు ుందని 2022 మేలో సుప్రీంకోర్టు లోని మరో బెంచ్ చెప్పటంతోనే తాము తుది నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఈ కేసు విచారణ మహారాష్ట్రలోని సీబీఐ కోర్టులో జరిగినందున దోషుల రెమిషన్ పై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని.. ఆ అధికారాన్ని గుజరాత్ బలవంతంగా లాక్కుందని సుప్రీం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు అప్పట్లో కలకలాన్ని రేపటంతో పాటు.. గుజరాత్ ప్రభుత్వం దోషులకు తగ్గించిన శిక్షాకాలన్ని రద్దు చేసింది. గోద్రోలో రైలు దహనం తర్వాత జరిగిన గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలపై జరిగిన దాడుల వేళ.. ఐదు నెలల గర్భిణి అయిన బిల్కిస్ బానో ను రేప్ చేయటం.. ఆమె మూడు నెలల కుమార్తెతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులను దోషులుగా తేలిన పదకొండు మంది హత్య చేయటం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీం తాజా వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి ఈ అంశం వార్తల్లోకి వచ్చింది.

Tags:    

Similar News