ఛైల్ద్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
అలాంటి వీడియోలు చూడటం, డౌన్ లోడ్ చేసుకోవడం ఫోక్సో చట్టం కింద నేరమని పేర్కొంది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టుపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఛైల్డ్ పోర్నోగ్రఫీ పై సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు... ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, అలాంటి వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవడం నేరమని పేర్కొంది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... ఛైల్డ్ పోర్నోగ్రఫీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. అలాంటి వీడియోలు చూడటం, డౌన్ లోడ్ చేసుకోవడం ఫోక్సో చట్టం కింద నేరమని పేర్కొంది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టుపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదు వంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిందం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి అత్యున్నత ధర్మాసనం పలు కీలక సూచనలు చేసింది.
ఫోక్సో చట్టంలోని "ఛైల్డ్ పోర్నోగ్రఫీ" అనే పదాన్ని "ఛైల్డ్ సెక్యువల్ ఎక్స్ ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్" అనే పదంతో మారుస్తూ చట్టానికి సవరణ చేయాలని తెలిపింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చేవరకూ దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని తెలిపింది.
కాగా... ఓ 28 ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్ లోడ్ చేసుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొన్న్నాడు. ఈ సమయంలో ఆ యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం తప్పేమీ కాదంటూ వ్యాఖ్యానించింది.
ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకు పంపడం వంటివీ చేయలేదని పేర్కొంది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతులను శిక్షించడం కంటే.. వారిని సరైన మార్గంలో పెట్టడంపై దృష్టిసారించాలని అభిప్రాయపడింది. దీంతో... ఈ తీర్పూపి పలు ఎన్జీవోలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
దీంతో... పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఇటువంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని వ్యాఖ్యానించింది. సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది. ఈ సందర్భంగ.. ఛైల్డ్ పోర్నోగ్రఫీ పదాన్ని మార్చాలంటూ కేంద్రానికి సూచన చేసింది.