జగన్ కేసులపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై రోజువారీ విచారణ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-07-03 10:52 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులపై దాఖలైన పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా.. సీబీఐ కోర్టులో ఉన్న వైఎస్ జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

అవును... ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... జగన్ కేసులకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.

ఇదే సమయంలో... కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జగన్ తరుపు న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. గతంలో జగన్ కేసులపై హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

కాగా గత ఏడాది చేగొండి హరిరామ జోగయ్య జగన్ కేసులపై న్యాయపోరాటం చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసును వీలైనంత తొందరగా విచారించాలంటు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నాడు హైకోర్టు జోగయ్యపై కీలక వ్యాఖ్యలు చేసింది! ఇందులో భాగంగా మీరు దాఖలు చేసిన పిటిషన్ లో "పబ్లిక్ ఇంట్రస్ట్" ఏముందని ప్రశ్నించీంది.

Read more!

ఇదే సమయలో... 2024 సాధారణ ఎన్నికల ముందే జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసి, తీర్పు వెలువరించాలని, ఈ మేరకు సీబీఐ కోర్టును ఆదేశించాలని నాడు జోగయ్య తన పిల్ లో పేర్కున్నారు. అయితే... దీనిపై అభ్యంతరం తెలిపిన రిజిస్ట్రీ... కేసు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది! ఇదే సమయంలో... పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలకు సిద్ధంకాగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

అయితే తాజాగా నేడు జగన్ కేసులపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... సీబీఐ కోర్టులో ఉన్న వైఎస్ జగన్ కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇదే సమయంలో... కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా జగన్ తరుపు న్యాయవాదులకు సూచించింది.

Tags:    

Similar News

eac