జీవనం ఉరుకులపరుగుమయం అయిన తరువాత దాదాపుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడకుండా ఉండడం లేదు. రాయి లాంటి మనిషినని చెప్పుకొనేవారు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. జీవన శైలి కారణంగా చాలా వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వాటిలో గ్యాస్ సమస్య ఒకటి... శరీరంలో గ్యాస్ ఉత్పత్తి అవ్వడం సాధారణమే అయినా అధికంగా ఉత్పత్తయితే సమస్య మొదలువుతుంది. జీర్ణాశయంలో అధిక మోతాదులో ఆమ్లాలు ఉత్పత్తి కావడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకుండా కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి ఇది గుండె, గొంతు వరకు నొప్పి రావడానికి కూడా దారి తీస్తుంది.
కొందరిలో అనునిత్యం ఈ సమస్య ఉంటుంది.. ఇంకొందరి భోజనం చేసిన వెంటనే ఉంటుంది. పలు రకాల ఆహార పదార్ధాల వల్ల కూడా పొట్టలో గ్యాస్ అధికంగా ఉత్పత్తవుతుంది. బంగాళదుంపలు, బీన్స్, మొక్క జన్న వంటి పదార్థాలు ఈ సమస్యకు కారణమవుతాయి.
గ్యాస్ కు కారణమయ్యే ఆహారపదార్థాల్లో కొన్ని..
యాపిల్ పండ్లు: యాపిల్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు.. అది కాదనలేని విషయమే అయినా కొన్ని విషయాల్లో మాత్రం అది ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. యాపిల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చురుకుగా ఉంటాయి కానీ ఇందులోని పెక్టిన్ అనే కార్బోహైడ్రేట్ మాత్రం గ్యాస్ అధిక మోతాదులో ఉత్పత్తి చేస్తుంది.
ఓట్స్: అందరూ వేలం వెర్రిగా కొంటున్న ఓట్స్ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో అంతే ఇబ్బందీ ఉంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందనడంలో ఎంలాంటి సందేహం లేనప్పటికీ గ్యాస్ సమస్యలకు మాత్రం కారణమవుతోంది. ఓట్స్ లో ఉండే సోలబుల్ ఫైబర్ ప్రేగుల్లో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తినకి కారణమవుతుంది.
బంగాళదుంపలు: దీనిలో పిండి పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది కొలన్ లో బ్యాక్టీరియాన్ ఏర్పరచి తిన్న ఆహారాన్ని జీర్ణం కానివ్వకుండా అడ్డుకొంటుంది. దాంతో గ్యాస్ ఏర్పడుతుంది.
క్యాండీస్ మిఠాయిల్లో కృత్రిమ మధురాలు చేర్చడం వల్ల ఇది గ్యాస్ కు కారణం అవుతుంది.
పాల ఉత్పత్తులు: పాలలో ఉండే లాక్టోజ్ అంత తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థం కాదు. దాంతో గ్యాస్ కు, కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది. ఒక్కోసారి విరోచనాలకూ దారి తీస్తుంది. పాల ఉత్పత్తుల్లోనూ లాక్టోజ్ ఉండడం వల్ల ఇదే సమస్య ఉంటుంది.
శీతల పానీయాలు: కార్బొనేటెడ్ పానీయాలు, కూల్ డ్రింక్స్ కడుపు ఉబ్బరానికి మరియు గ్యాస్ట్రిక్ కు కారణం అవుతాయి. అనవసరమైన గాలి జీర్ణ వ్యవస్థలో చేరి జీర్ణక్రియను అడ్డుకొంటుంది. దాంతో జీర్ణక్రియ మందగించి గ్యాస్ ను ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి పానీయాలను గర్భిణులు తాగకపోవడం మంచిది.
ప్రాసెస్డ్ ఫుడ్స్ : ప్రాసెస్ చేసిన ఆహారాల్లో చక్కెర, లాక్టోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గ్యాస్ కు కారణం అవుతుంది . అంతే కాకుండా . ఈ ఆహారాల్లో అనారోగ్యకరమైన ఆహారాలు చేర్చి ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా సవ్యంగా జరగదు. దీని వల్ల పొట్ట ఉబ్బరంగా ఉంటుంది.
క్యాబేజ్ మరియు మొక్కజన్నలు: మొక్కజన్న గింజలు సులభంగా అరగవు... కడుపు నొప్పి మరియు గ్యాస్ కు కారణం అవుతాయి. క్యాబేజ్ లో కూడా షుగర్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా కష్టంగా అనిపించి పొట్ట ఉదరంలో నొప్పికి దారితీస్తుంది.
చూయింగ్ గమ్: చూయింగ్ గమ్ నములుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కడుపులోకి గాలి వెళ్తుంది. అంతే కాదు చూయింగ్ గమ్ లోని ఎక్కువ షుగర్స్ ఉండటం వల్ల జీర్ణక్రియ లోపించి గ్యాస్ కు కారణం అవుతుంది. దీని వల్ల పొట్ట ఉబ్బిపోయి నానా అవస్థలు పడాల్సి వస్తుంది.
సోయా గింజలు: బీన్స్ కూడా గ్యాస్ ఉత్పన్నం చేసే ఆహారాల లిస్టులోకే వస్తాయి. వీటిలో ఉండే రఫినోస్ గ్యాస్ కారకంగా పనిచేస్తుంది.