టాటూలకు సంబంధించి ఆసక్తికర విషయం!
ఇందులో భాగంగా టాటూలు వేయించుకున్న నలుగురిలో ఒక్కరు ఆ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారని పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.
చాలా మంది టాటాలు వేయించుకుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. మరికొంతమదైతే రెగ్యులర్ గా కొత్త కొత్త టాటాలను వేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది పేరెంట్స్ పేర్లు రాయించుకుంటే.. మరికొంతమంది ప్రియుడు, ప్రియురాలి పేర్లు రాయించుకుంటూ ఉంటారు. ఇంకొంత మంది పిల్లల పేర్లు, దేవుళ్ల బొమ్మలతో టాటూలు వేయించుకుంటుంటారు. ఈ క్రమంలో టాటూల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... టాటూలంటే కొంతమంది పిచ్చి ఇష్టం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొంతమంది పైకి బహిరంగంగా కనిపించే చోట టాటూలు వేయించుకుంటే.. కొంతమంది బయటకు కనిపించకుండా వేయించుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది రెగ్యులర్ గా వాటిని మారుస్తుంటారు. మరికొంతమంది వేయించుకున్న టాటూలను కొంతకాలానికి తీసేయాలని అనుకుంటూ ఉంటారు. దీనికోసం టాటూలను రిమూవ్ చేసే క్లీనిక్కులకు వెళ్తుంటారు. ఈ సమయంలో వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.
వాస్తవానికి కొంతమంది చాలా ఇంట్రస్ట్ తో టాటూలు వేయించుకుంటే.. మరికొంతమంది మాత్రం ఎమోషన్ లో వేయించేసుకుంటారు. దీంతో కొంతకాలానికి వాటిని తొలగించాలని భావిస్తుంటారు. ఎమోషన్ లో నిర్ణయం తీసుకుని వేయించుకున్నంత సులువుగా వాటిని రిమూవ్ చేసుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తుంటారు. ఈ సమయంలో ఇలా టాటూలు వేయించుకున్న వారిలో కనీసం నలుగురిలో ఒక్కరు ఆ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారంట.
ఇందులో భాగంగా టాటూలు వేయించుకున్న నలుగురిలో ఒక్కరు ఆ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారని పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే వాటిని తొలగించుకునేందుకు.. బెస్ట్ టాటూ క్లీనిక్స్ అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారని తెలిపింది.
కాగా... టాటూలను తొలగించుకునే విషయంలో అనుభవజ్ఞులైన వారినే సంప్రదించాలని చెబుతారు. టాటూలను తొలగించే ప్రక్రియ లేజర్ ద్వారా ఉండటం వల్ల.. చర్మ పొర సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేస్తారు. పైగా ఈ ప్రక్రియ ఒక సెషన్ లో పూర్తయ్యేది కాదని అంటారు. ఇంక్, ఆర్ట్ స్టైల్, టాటూ సైజ్ మొదలైన విషయాలపై ఈ సెషన్స్ ఆధారపడి ఉంటాయి.