ప్రపంచంలో అత్యధికమంది మాట్లాడేభాష ఇదే!

ప్రపంచంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి

Update: 2023-07-15 10:57 GMT

ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష ఏది.. వాటిలో ఇండియాలో మాట్లాడే స్థానిక భాషల్లో వేటికైనా చోటు ఉందా.. అసలు ప్రపంచంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాం..!

ఏడు ఖండాలుగా ఉన్న భూగోళం మొత్తంమీద 200కు పైగా దేశాలు ఉంటే... ఈ దేశాలన్నింటిలో మొత్తం 7,000కు పైగా భాషలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలోనూ ఒక్కే భాష మాతృ భాషగా, జాతీయ / అధికార భాషగా ఉంటుంటుంది. అయితే ఈ ఏడు వేల భాషల్లోనూ టాప్ 10 భాషలేమిటనేది ఇప్పుడు చూద్దాం.

ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఇంగ్లిష్. ప్రపంచంలో సుమారు 60కి పైగా దేశాల్లో 135కోట్లకు పైగా ప్రజలు ఈ భాషను మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అందుకే దీన్ని "యూనివర్శల్ లాంగ్వేజ్" అంటారు. ఈ భాష టాప్ వన్ లో కొనసాగుతుంది.

ఇదే సమయంలో... చైనీస్‌ సంప్రదాయ భాషగా ఉన్న మాండరీన్‌ ని ప్రపంచ వ్యాప్తంగా 112 కోట్ల మంది మాట్లాడుతున్నారని తెలుస్తుంది. చైనాతో పాటు తైవాన్‌, సింగపూర్‌ దేశాల్లో ఇది అధికార భాషగా ఉంది.

ఇక మూడో స్థానంలో భారతీయ అధికారిక భాష హిందీ ఉంది. ఈ భాషను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60కోట్ల మంది మాట్లాడతారట. మన దేశంలోనే కాకుండా పాకిస్థాన్‌, ఫిజీ దేశాల్లోనూ హిందీని అధికారిక భాషగా వ్యవహరిస్తున్నారు.

ఇక నాలుగో స్థానంలో స్పెయిన్‌ దేశానికి చెందిన స్పానిష్‌ భాష కొనసాగుతోందని తెలుస్తుంది. 20కిపైగా దేశాల్లో ఇది అధికారిక భాషగా ఉంది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా 54కోట్ల మంది స్పానిష్‌ మాట్లాడుతున్నారని అంటున్నారు.

ఇక ఐదోస్థానంలో 27కోట్ల మంది మాట్లాడే అరబిక్ భాష ఉందని తెలుస్తుంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్‌, ఒమన్‌, లిబియా, సోమాలియా, బహ్రెయిన్‌, ఇరాక్‌ సహా 22 దేశాల సమూహాన్ని అరబ్‌ ప్రపంచంగా పిలుస్తుంటారు. ఈ దేశాల అధికారిక భాష అరబిక్‌.

ఇక మన దేశంలోని పశ్చిమ్‌ బెంగాల్‌ తోపాటు త్రిపుర, అసోం, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోని పలు చోట్ల.., అదే విధంగా బంగ్లాదేశ్‌ అధికారిక భాషగా ఉన్న బెంగాలీ ఆరోస్థానంలో ఉందని తెలుస్తుంది. ఈ భాషను 26.8కోట్లు మంది మాట్లాడుతున్నారట.

తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఫ్రెంచ్‌ అధికారిక భాషగా ఉన్న ఫ్రెంచ్‌ ను 26.7 కోట్ల మంది మాట్లాడతారని అంటున్నారు. ఈ భాష ఏడో స్థానంలో ఉంది!

తర్వాత రష్యా అధికారిక భాష అయిన రష్యన్‌ ను 25.8 కోట్ల మంది మాట్లాడుతుండటంతో ఇది ఎనిమిదో స్థానంలో నిలిచింది. అనంతరం 25.7 కోట్ల మంది మాట్లాడే భాషగా... పోర్చుగల్‌ దేశ భాష పోర్చుగీసు ఉంది. ఆ దేశంలో కన్నా బ్రెజిల్‌, అంగోలా, మొజాంబిక్‌ దేశాల్లోని ప్రజలు ఎక్కువగా పోర్చుగీసులో మాట్లాడుతారట. దీని స్థానం తొమ్మిదిగా ఉంది.

ఇదే సమయంలో ఉర్దూ భాష టాప్ 10 ప్రపంచ భాషల్లో పదోస్థానంలో నిలిచింది. ఈ భాష లిపిని కూడా అరబిక్‌ లాగే కుడి నుంచి ఎడమకు రాస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉర్దూ మాట్లాడేవారు 23కోట్ల మంది ఉన్నారని అంటున్నారు.

కాగా... ప్రపంచ వ్యాప్తంగా 9.6కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడేవారున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News