మహేష్ నవమన్మధుడి రూపం వెనక అదీ స్టోరీ
నట్స్ ఐస్ క్రీమ్ తింటే ఫ్యాట్ వస్తుంది! కానీ ఇక్కడ నట్స్ తింటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
నట్స్ ఐస్ క్రీమ్ తింటే ఫ్యాట్ వస్తుంది! కానీ ఇక్కడ నట్స్ తింటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. యాభై వయసుకు చేరువవుతున్నా టీనేజీ వైబ్స్ ని మెయింటెయిన్ చేయడమెలానో తాను కనిపెట్టిన ఫార్ములాని అభిమానుల కోసం షేర్ చేసుకున్నాడు. అంతేకాదు.. ఆయన అందం ఆరోగ్యం వెనక అసలు సీక్రెట్ ని బయటపెట్టారు. యువతరానికి అన్ని విధాలా స్ఫూర్తి ప్రదాత అయిన మహేష్ అల్పాహారం హ్యాబిట్ యువతరాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. తాజాగా అతడు తన బ్రేక్ ఫాస్ట్ సేవనం తాలూకా ఫోటోని షేర్ చేసి తాను ఏం తీసుకుంటున్నాడో వెల్లడించారు.
నట్స్ తో తయారు చేసిన ఓట్ మీల్ ని మహేష్ ఉదయం పూట అల్పాహారంగా ఆరగిస్తున్నాడు. ``రాత్రిపూట నానబెట్టిన ఓట్స్- కాయలు.. గింజలతో రూపొందించిన పదార్థమిది. మరో రెండు గంటలలో నాకు పవర్ కావాలి`` అని మహేష్ వ్యాఖ్యను జోడించారు. తక్షణమే తనకు ఎనర్జీ కావాలంటే మహేష్ ఇలా ప్లాన్ చేస్తారని దీనిని బట్టి అర్థమవుతోంది. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలను గ్లామర్ రంగంలోని సెలబ్రిటీలు ఇష్టపడతారు. ఆహారంలో ఎలాంటి డెఫిషియన్సీ లేకుండా ఆకు కూరలు కాయగూరలు సహా అన్నిటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తారు. కారణం ఏదైనా కానీ మంచి డైట్ ఆరోగ్యకర అలవాట్లతో మహేష్ ఈ ఏజ్ లో కూడా షాకిచ్చే రూపంతో కనిపిస్తున్నాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి త్రివిక్రమ్ తో `గుంటూరు కారం` చిత్రీకరణలో పాల్గొంటున్న మహేష్ బాబు రాజమౌళితో భారీ పాన్ ఇండియా సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. జక్కన్న భారీ ఫ్రాంఛైజీ సినిమాల్లో నటించేందుకు మహేష్ ఏకంగా నాలుగైదేళ్ల సమయాన్ని వెచ్చించనున్నారని తెలుస్తోంది.