పడకగదిలో కొత్త సుఖం.. ఏఐ ఆధారిత సెక్స్ రోబోట్!

శృంగార భాగస్వామిని కూడా ఏఐ సహకారంతో సాధ్యం చేయొచ్చని అంటున్నారంట గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్.

Update: 2023-07-20 13:08 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల మానవ జీవితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని.. ఇది అత్యంత ప్రమాదకరమైన టెక్నాలజీ అని పలువురు మాజీ సీఈఓలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. మనిషికి మనిషికీ మధ్య ఉన్న బంధాన్ని నాశనం చేయడంలో ఏఐ కీలక భూమిక పోషించబోతోందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో శృంగార భాగస్వామిని కూడా ఏఐ సహకారంతో సాధ్యం చేయొచ్చని అంటున్నారంట గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్. అవును... సాన్నిహిత్యంతో ముడిపడి ఉన్న మానసిక, భావోద్వేగ ఉద్దీపనలను కూడా కృత్రిమంగా పునర్నిర్మించవచ్చని ఆయన చెబుతున్నారు.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం... కృత్రిమ మేధస్సు ఆధారిత సెక్స్ రోబోలు సజీవంగా ఉన్నట్లు, పడకగదిలో భాగస్వామి యొక్క అవసరాన్ని తొలగిస్తాయని అంచనా వేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... మరో మనిషితో ఉన్న ఫీల్ నే ఇవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారంట.

అవును... గూగుల్ రహస్య పరిశోధన-అభివృద్ధి విభాగం మాజీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మొహమ్మద్ మో గావదత్... ఏఐ "ప్రేమ సంబంధాల పునఃరూపకల్పన"ను ప్రారంభిస్తుందని.. దీంతో ప్రజలు నిజ జీవితంలో లైంగిక కార్యక్రమాలలో కృత్రిమంగా సృష్టించబడిన వాటి మధ్య తేడాను గుర్తించలేరని చెబుతున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో మానవులు త్వరలో వర్చువల్ రియాలిటీ, యాపిల్ విజన్ ప్రో లేదా క్వెస్ట్ 3 వంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌ సెట్‌ లను ఉపయోగించి సెక్స్‌ ను అనుకరించగలరని గావదత్ చెబుతున్నారంట. అదేవిధంగా... కొంతకాలం తర్వాత మానవ నాడీ వ్యవస్థకు నేరుగా కనెక్ట్ అయ్యే న్యూరాలింక్, ఇతర మార్గాల గురించి ఆలోచిస్తే... ఒక మనిషికి మరో మనిషి ఎందుకు అవసరం? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారని తెలుస్తుంది.

దీంతో... ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ముందు ముందు మానవ జాతిని మరెంతగా ప్రభావితం చేయబోతుందనేది వేచి చూడాలి!


Tags:    

Similar News