నిమ్మ‌కాయ‌ను చూస్తే నోరూరిన‌ట్టు.. మొబైల్‌ చూస్తే చేతులు అలా వెళ్లిపోతున్నాయ‌ట‌!

ఇలా వెల్ల‌డించిన అధ్య‌య‌న సంస్థ చిన్న‌దేమీ కాదు.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.

Update: 2024-02-14 03:00 GMT

దేశంలో మరుగు దొడ్డి లేని కుటుంబ‌మైనా ఉంది కానీ.. స్మార్ట్ ఫోన్‌లేని కుటుంబం లేద‌ని ఇటీవ‌ల ఓ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. రూ.10 వేలు అంత‌క‌న్నా ఎక్కువ‌, త‌క్కువ ఖ‌రీదులో ఉండే ఏదో ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారతీయుల చేతుల్లో క‌ద‌లాడుతోం దని ఆ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అయితే, తాజాగా మ‌రో అధ్య‌య‌నం ఇంకో సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది. నిమ్మ‌కాయ ను చూస్తే నోరూరిన‌ట్టుగా.. మొబైల్‌ ఫోన్ చూస్తే.. భారతీయుల చేతులు దానిపై అలా అసంక‌ల్పితంగా(మ‌న ప్ర‌మేయం లేకుండా) వెళ్లిపోతున్నాయ‌ని తేల్చి చెప్పింది. ఇలా వెల్ల‌డించిన అధ్య‌య‌న సంస్థ చిన్న‌దేమీ కాదు.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. ఇది అతి పెద్ద స‌ర్వే సంస్థ‌.

ఇటీవ‌ల భార‌త్‌లో మొబైల్ వినియోగ‌దారుల‌పై ఈ సంస్థ స‌ర్వే చేసింది. ఈ సంస్థ వెల్ల‌డించిన స‌ర్వే ఫ‌లితాల్లో ఆశ్చ‌ర్య‌క‌ర విష యాలు వెలుగు చూశాయి. ప్ర‌ధానంగా భార‌తీయుల్లో స‌గానికిపైగా మొబైల్ వినియోగించేవారు.. త‌మ‌కు అవ‌స‌రం లేకున్నా కొంటున్నార‌ని స‌ర్వే తెలిపింది. అంతేకాదు.. పుట్టిన‌రోజుకు బ‌ట్టలు కొనుగోలు చేసినా చేయ‌క‌పోయినా.. మొబైల్ ఫోన్ల‌కు పెద్ద ఎత్తున ఖ‌ర్చు పెడుతున్న‌ట్టు తెలిపింది. ఇక‌, ఉద‌యాన్నే ప‌డ‌క మంచం మీద నుంచి లేచిన 15 నిమిషాల్లోనే 90 శాతం మంది మొబైల్ వినియోగ‌దారులు ఫోన్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిపింది.

ఇంకా స‌ర్వేలో ఏం తేలాయంటే..

+ స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లలో దాదాపు సగం మందికి తాము స్మార్ట్‌ ఎందుకు వాడుతున్నారో తెలీదు.

+ స్మార్ట్‌ ఫోన్‌ను తరచూ చేతిలోకి తీసుకోవడం ఒక అసంకల్పిత ప్రతీకర చర్యలా మారింది.

+ తమ ప్రమేయం లేకుండానే ఫోన్‌ను చేతితో తాకుతున్నారు. చేతిలోకి తీసుకుంటున్నారు. యూ

+ స్మార్ట్‌ ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్న భారతీయుల్లో 50 శాతం మంది, అనుకోకుండానే ఆ పని చేస్తున్నారు.

+ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, తమ అధ్యయనం కోసం వెయ్యి మందికి పైగా భారతీయులను ప్రశ్నించింది.

+ ఒక సాధారణ వినియోగదారు రోజుకు దాదాపు 70 నుంచి 80 సార్లు తమ స్మార్ట్‌ ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్నాడు.

+ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగంలో మెజారిటీ పార్ట్ సోషల్‌ మీడియాదే.

+ త‌దుప‌రి స్థానం షాపింగ్. గేమింగ్

+ ఫోన్‌ వాడుతున్న సందర్భంలో దాదాపు 50 నుంచి 55 శాతం సమయాన్ని స్ట్రీమింగ్ యాప్‌ల కోసం వెచ్చిస్తున్నారు.

+ 90 శాతం మంది వినియోగదారులు తాము నిద్ర లేచిన 15 నిమిషాల్లోపే ఫోన్‌ చెక్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News