గిన్నీస్ రికార్డుకెక్కిన 'ఘాటు' ముద్దు... స్పెషాలిటీ ఇదే!

తాజాగా కెనడాకు చెందిన ఓ జంట 15 నిమిషాల 6.5 సెకన్లపాటు ముద్దు పెట్టుకున్న ఘటన

Update: 2023-07-27 04:07 GMT

ముద్దులు పలురకములు! తెలుగు సినిమా పాటల్లో వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు మరింత విపులంగా ఉంటుంటాయి. వాటిలో విన్నపాల ముద్దు మొదలు జున్నుపాల ముద్దు వరకూ చాలానే ఉంటాయి. వీటితోపాటు అల్లరి ముద్దు ఉంటుంది.. అల్లిక ముద్దూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పుకునేది మాత్రం "ఘాటు" ముద్దు!

గిన్నీస్ రికార్డుకెక్కాలని ఒక కపుల్ ఘాటైన ముద్దు పెట్టుకున్నారు. అది కూడా సుమారు 15 నిమిషాల 6.5 సెకన్లు. అదేమిటి... గంటల పాటు ముద్దులు పెట్టుకున్న వారు ఉండగా... వీరి 15 నిమిషాల ముద్దు ఎలా గినీస్ రికార్డుకెక్కుతుంది అని ఆశ్చర్యపోకండి. ఇది మామూలు ముద్దు కాదు.. ముందుగా చెప్పుకున్నట్లే ఘాటైన ముద్దు.

అవును... తాజాగా కెనడాకు చెందిన ఓ జంట 15 నిమిషాల 6.5 సెకన్లపాటు ముద్దు పెట్టుకున్న ఘటన గిన్నీస్ రికార్డ్స్‌ లో నమోదైంది. వారు ముద్దు పెట్టుకోవడానికి ముందు "హెబనెరో పెప్పర్‌" తినడమే ఈ రికార్డ్ లోని ప్రత్యేకత. కారణం... ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయగా "హెబనెరో పెప్పర్‌" పేరుంది. ఇంతకంటే ఘాటైన మిరపకాయను ఇప్పటివరకూ ప్రపంచం గుర్తించలేదు!

వివరాళ్లోకి వెళ్తే... మైక్‌, జామీ జాక్ అనే కెనడా దేశానికి చెందిన దంపతులు త్వరలో తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఆ స్పెషల్ డే నాడు స్పెషల్ గా గుర్తుండిపోయేలా ఈ ప్రయత్నం చేశారు. ఫలితంగా... ఘాటైన ముద్దుతో రికార్డ్ సృష్టించారు.

కాగా, మైక్‌ పేరిట ప్రపంచంలోనే ఘాటైన పెప్పర్లు తిన్న రికార్డులు ఇదివరకే ఉన్నాయి. అయితే ఈ సారి తన భార్య జామీ జాక్ ని కూడా ఈ రికార్డులో భాగం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఆమెకు నెలరోజుల నుంచి శిక్షణ ఇస్తున్నాడు. దీంతో భర్త చెప్పిన మెలుకువలు పాటిస్తూ జామీ జాక్ కూడా ఈ రికార్డ్ లో సక్సెస్ ఫుల్ గా నిలబడింది.

అయితే ఈ రికార్డ్ అనంతరం స్పందించిన మైక్... ఇది జామీకి తొలి ప్రపంచ రికార్డు కావడంతో మరింత ఆనందంగా ఉందని చెప్పారు. ఈ రికార్డుతో తాము ఆగిపోమని.. సరికొత్త చుంబన రికార్డు నెలకొల్పుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా తమ బంధువులు, స్నేహితులు సైతం సంతోషంగా ఉన్నారని తెలిపారు.

Tags:    

Similar News