వయస్సు కేవలం ఒక సంఖ్య... 99 ఏళ్ల భారత మహిళకు యూఎస్ పౌరసత్వం!

99 ఏళ్ల భారతీయ మహిళ దాయిబాయి తాజాగా అమెరికా పౌరసత్వం పొందిన తర్వాత అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

Update: 2024-04-06 14:30 GMT

అమెరికా పౌరసత్వం చాలా మందికి కల అని చెబుతుంటారు! ఎప్పటికైనా యూఎస్ లో సెటిల్ అవ్వాలి అనే మాటలు చాలా మంది చాలా సందర్భాల్లో చెబుతుంటారు. ఈ సమయంలో తాజాగా ఒక భారతీయ మహిళకు అమెరికా పౌరసత్వం దక్కింది. అందులో విచిత్రం ఏముంది అనుకుంటే పొరపాటే... ప్రస్తుతం ఆమె వయసు 99 సంవత్సరాలు!

అవును... 99 ఏళ్ల మహిళ అమెరికా పౌరసత్వం దక్కించుకొంది. తాజాగా ఈ విషయాన్ని ఆన్ లైన్ వేదికగా వెళ్లడించిన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్... వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే... 99 ఏళ్ల భారతీయ మహిళ దాయిబాయి తాజాగా అమెరికా పౌరసత్వం పొందిన తర్వాత అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ఫోటోలో ఆమె కుమార్తె కూడా ఉన్నారు. దాయిబాయికి అభినందనలు అని వెల్లడించింది.

కాగా... వలసదారుల వీసా పిటిషన్లు, రెసిడెన్సీ దరఖాస్తులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తులను నిర్వహించే బాధ్యతను యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. యూఎస్ లో పని చేయడానికి వేలాది మంది భారతీయ టెక్కీలు ఉపయోగించే హెచ్-1బీ వీసాల వంటి వలసేతర ఉద్యోగుల కోసం కూడా ఈ ఏజెన్సీ పిటిషన్లను నిర్వహిస్తుంది.

ఇక తాజాగా దాయిబాయికి యూఎస్ పౌరసత్వం లభించిందని పలువురు సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ... యూఎస్ లో సహజీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందంటూ కొందరు భారతీయ ఎక్స్ వినియోదారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా యూఎస్ పౌరసత్వం దక్కించుకున్న దాయిబాయి.. 1925లో భారత్ లో జన్మించారు. ప్రస్తుతం ఆమె కొన్నాళ్లుగా తన కుమార్తెతో కలిసి ఓర్లాండోలో ఉంటున్నారు.

Tags:    

Similar News