పిల్లులనూ హింసించిన కేసు... యూఎస్ లో భారతీయ విద్యార్థి కి జైలు!

సాధారణంగా వీది కుక్కలు కనిపించినా, పిల్లులు కనిపించినా వాటిని రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టేస్తుంటారు.

Update: 2023-09-08 05:18 GMT

సాధారణంగా వీది కుక్కలు కనిపించినా, పిల్లులు కనిపించినా వాటిని రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టేస్తుంటారు. కుక్కలు దాడిచేస్తాయేమో అనే భయంతో కర్ర చేతిపట్టుకోవడం సంగతి అటుంచితే... కావాలని జీవహింసకు పాల్పడాలనే ఉద్దేశ్యంతో మూగజీవాలను వేదించకూడదనేది అంతా చెప్పే మాట.

కానీ అమెరికాలో ఒక భారతీయ విద్యార్థి అదే పనికి పూనుకున్నాడ్. భారీగా శిక్ష అన్నుభవించాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నాడు. పిల్లులను హింసించిన నేరానికి అతడికి కోర్టు ఆరున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.

అవును... ఉత్తర టెక్సాస్‌ కు చెందిన శుభంకర్ కౌలే (28) అనే వ్యక్తి కావాలని పిల్లులను వేధించాడు! సుమారు కొన్ని గంటల పాటు ఈ పనులు చేశాడు. అయితే ఆ విషయాలు అక్కడున్న సీసీ కెమెరాలో రియార్డ్ అయ్యాయి. వెంటనే కేసు ఫైల్ అయ్యింది.. తాజాగా తీర్పు వచ్చింది.. 6.5 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

వివరాళ్లోకి వెళ్తే... శుభంకర్ కౌలే అనే భారతీయ విద్యార్థి అక్టోబర్ 9, 2021న సూమారు ఐదు గంటల పాటు పిల్లులను ముద్దుగా పిలవడం, అవి దగ్గరకు వచ్చాక వాటిని కొట్టడం, చేతులతో పట్టుకుని విసిరేయడం వంటి పనులకు పాల్పడ్డాడు. అయితే ఈ వ్యవహారం కెమెరాలో రికార్డ్ అయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఈ సమయంలో పిల్లులు తీవ్రంగా గాయపడ్డాయని.. వాటిలో ఒక పిల్లు తన కాలును పూర్తిగా కోల్పోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందని వైద్యులు తెలిపారు. దీంతో అక్టోబరు 15, 2021న టెక్సాస్‌ కు చెందిన చీఫ్ ఇన్వెస్టిగేటర్ కోర్ట్నీ బర్న్స్... శుభంకర్ కౌల్ అరెస్ట్ కోసం వారెంట్ దాఖలు చేశారు.

దీంతో డల్లాస్‌ లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం లెవ్ స్టెరెట్ జైలుకు తీసుకెళ్లారు. అనంతరం $50,000 బాండ్‌ పై విడుదల చేయబడ్డాడు. అనంతరం వాయిదాలకు అటెండ్ అవుతూనే ఉన్నాడు. తన అనుమతి లేకుండా సీక్రెట్ గా వీడియోలు తీసి, తన గోప్యతను ఉల్లంఘించారంటూ వాదించడం మొదలుపెట్టాడు. ఆ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.

దీంతో ఈ ఏడాది ఆగస్టు 31, గురువారం... అతడిని ఆరున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ హంట్ కౌంటీ 354వ జ్యుడీషియల్ కోర్టు తీర్పు వెల్లడించింది.

Tags:    

Similar News