భారతీయులకు మరో షాక్... హెచ్-1బీవీసాలపై రామస్వామి...!

ఈమధ్య కాలంలో భారతీయులకు యూకే, యూఎస్ లు వరుసగా షాక్ లు ఇస్తున్నాయి.

Update: 2023-09-17 11:32 GMT

ఈమధ్య కాలంలో భారతీయులకు యూకే, యూఎస్ లు వరుసగా షాక్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే వీసాల ధరలు 200శాతం పెంచుతూ భారతీయ విద్యార్థులకు యూకే షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమెరికా నుంచి అంతకు మించి అన్నట్లుగా షాకింగ్ వార్తలు వెలువడుతున్నాయి. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న వివేక్ రామస్వామి నుంచి కావడం గమనార్హం.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై గట్టి పోటీ జరుగుతోంది. ఈ సమయంలో అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. వారిలో వివేక్ రామస్వామి ఒకరు. ఇప్పుడు ఆయనే భారతీయులకు షాకిచ్చేలా వ్యాఖ్యానించారు.

అవును... వివేక్ రామస్వామి భారతీయులకు షాక్ ఇస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులు అమెరికాకు వెళ్లేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్న హెచ్-1బి వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే వీసా వ్యవస్థలో మార్పులు చేస్తానంటూ హామీలిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బి వీసాలను ముగించాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది!

దీంతో భారతీయ అమెరికన్ అయిన వివేక్ రామస్వామి లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు! ఇప్పటికే తాను అధికారంలోకి వస్తే 75శాతం ఉద్యోగులను తొలగించడంతోపాటు ఎఫ్‌.బీ.ఐ.ని మూసివేస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీసాలపై షాకింగ్ గా స్పందించారు.

కాగా... ఐటీ కంపెనీలు ఏటా వేల మందిని హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికాకు పంపిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 గణాంకాల ప్రకారం.. అక్కడ 85వేల మందికి అవకాశం ఉండగా.. సుమారు 8లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇదే క్రమంలో ప్రతి సంవత్సరం ఇచ్చే 85 వేలల్లో 65 వేలు అందరికీ అందుబాటులో ఉంటుండగా.. 20 వేల వీసాలు మాత్రం అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారే పొందే అవకాశం ఉంటుంది.

అయితే, ఈ వీసాలపై కఠిన వైఖరి అవలంబించిన డొనాల్డ్‌ ట్రంప్.. వీటి సంఖ్యను నిరోధించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాను అధికారంలోకి వస్తే లాటరీ ఆధారిత హెచ్‌-1బీ వీసా ప్రక్రియకు స్వస్తిచెప్పి దాని స్థానంలో మెరిటోక్రాటిక్ (ప్రతిభ ఆధారిత) విధానాన్ని తెస్తానని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

Tags:    

Similar News