ఐఫోన్‌ పై నిషేధం విధించిన ప్రభుత్వం!

అమెరికన్లు తమ పరికరాల ను వైర్ ట్యాపింగ్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని తమ అధికారులు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారన్ని అంటున్నారు.

Update: 2023-07-19 04:18 GMT

ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తులకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్ని విషయాల్లోనూ బడ్జెట్ చూసే మెజారిటీ ప్రజలు ఐఫోన్‌ విషయం లో మాత్రం ఎమ్మార్పీ చూడరనే నానుడి కూడా ఉందని అంటుంటారు. ఈ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న యాపిల్ ఉత్పత్తుల్ల పై తాజాగా ఒక దేశం నిషేధం విధించింది.

అవును... అంతర్జాతీయంగా ఎంత ఆదరణ పొందుతున్న యాపిల్ ఉత్పత్తుల ను రష్యా బ్యాన్ చేసిందని తెలుస్తుంది. ఇక పై తమ దేశం లో ఎవరూ యాపిల్ ఉత్పత్తులు వాడొద్దని సూచించిందని అంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల కు ఐఫోన్‌ ఉపయోగించకూడదంటూ హెచ్చరికలు జారీ చేసిందని సమాచారం. అయితే దీనివెనుక పెద్ద కథే ఉందని తెలుస్తుంది.

ఐఫోన్‌ ల వాడకం నిషేధించాల ని రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం... యాపిల్ అమెరికా కు చెందిన సంస్థ కావడమే అని తెలుస్తుంది. అవును.. అమెరికా - రష్యాల మధ్య ఉన్న శతృత్వం గురించి తెలిసిందే. దీంతో అమెరికా కంపెనీలు తమ పై గూఢచర్యానికి పాల్పడుతున్నాయని రష్యాన్‌ అధికారులు భావిస్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌... అమెరికా తమ ఉత్పత్తులతో హ్యాకింగ్‌ కు పాల్పడే అవకాశం ఉందంటూ యాపిల్‌ ఉత్పత్తుల ను ఉపయోగించడం మానేయాల ని అధికారుల ను ఇదివరకే ఆదేశించిందని తెలుస్తుంది. ఇదే క్రమంలో తాజగా అక్కడి వాణిజ్యశాఖ కూడా ఐఫోన్లను వాడవద్దని ఉద్యోగుల ను ఆదేశించిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయాల పై రష్యా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నిపుణుడు ఆండ్రీ సోల్డాటోవ్ స్పందించారని తెలుస్తుంది. ఇందు లో భాగంగా... అమెరికన్లు తమ పరికరాల ను వైర్ ట్యాపింగ్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని తమ అధికారులు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారన్ని అంటున్నారు.

అయితే అధికారిక వినియోగం పై నిషేధం ఉన్నప్పటికీ.. అది సాధారణ వినియోగదారుల పై ప్రభావం చూపదని తెలుస్తుంది. గత ఏడాది ఉక్రెయిన్‌ పై పూర్తి స్థాయి దాడి తర్వాత ఆపిల్ రష్యన్ మార్కెట్ నుండి వైదొలిగింది. కానీ కంపెనీ ఉత్పత్తులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయని అంటున్నారు.

Tags:    

Similar News