నిక్కరు..బ్లౌజులో సైకిల్ పై సువారీ!
నేహా శర్మ సిస్టర్.. అయేషా శర్మ సోషల్ మీడియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
నేహా శర్మ సిస్టర్.. అయేషా శర్మ సోషల్ మీడియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు సూపర్ హాట్ ఫోటోలతో సెగలు పుట్టిస్తుంది. మోడ్రన్ దుస్తుల్లో మంటలు రేపుతుంది. అమ్మడు ఎలాంటి పిక్ అయినా ఇన్ స్టాకి ఎక్కాల్సిందే. అక్కడ రచ్చ జరగాల్సిందే. తాజాగా బ్యూటీ మరో సంచలన పిక్ తో ముందుకొచ్చేసింది. ఇదిగో ఇలా నడి వీధుల్లో బ్లూకలర్ నిక్కరు ధరించి..వైట్ కలర్ బ్లౌజులో సైకిల్ యాత్ర చేస్తోంది. భుజానికి ఓ చిన్న హ్యాండ్ బ్యాగ్ తగలిచింది.
వెకేషన్ లో భాగంగా అక్కడ వేడిమిని తట్టుకోలేక ఇలా కురచ దుస్తుల్లో కి దూరిపోయి కుర్రకారుని పరేషాన్ చేస్తోంది. కిల్లర్ లుక్ లో మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. అమ్మడి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. వాకింగ్ కి బధుల ఇలా మిట్ట మధ్నాహం వీధుల్లో సైక్లింగ్ చేస్తుందా? అంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇలా ఎంత ప్రయత్నించినా ఆ క్రేజ్ మాత్రం సోషల్ మీడియాకే పరిమితమవుతుంది. అమ్మడికి ఇప్పటికీ అవకాశాలు రావడం లేదు. సత్యమేవ జయతే తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేస్తోంగానీ ఎవరూ అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది ఓ వెబ్ సిరీస్ చేసినా అక్కడా బిజీ కాలేకపోయింది. ఓటీటీలోనూ అమ్మడికి అవకాశాలు రావడం లేదు. అమ్మడి కన్నా వెనుకొచ్చిన వారంతా బిజీ అవుతున్నారు గానీ ఐశా మాత్రం ఇంకా అక్కడే ఉంది.
మరోవైపు అక్క నేహాశర్మ..చెల్లి కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తోన్న అవి ఫలించడం లేదు. అయినా శర్మ సిస్టర్స్ మాత్రం సంకల్పం మాత్రం కోల్పోలేదు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు..విమర్శలు తెరపైకి వచ్చినా ఎవరి ప్రయత్నాలు ఆపలేదు. సాధించే వరకూ పోరాడుతూనే ఉంటామని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.