జాన్వీ అందానికి మైమ‌రిచి ప్రేమ క‌విత రాసాడు

శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా సినీరంగంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అంద‌చందాలు, న‌ట‌న‌కు నెమ్మ‌దిగా ఆడియెన్ క‌నెక్ట‌యిపోయారు.

Update: 2023-11-06 02:45 GMT

జాన్వికపూర్ ప‌రిచయం అవ‌స‌రం లేదు. శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా సినీరంగంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అంద‌చందాలు, న‌ట‌న‌కు నెమ్మ‌దిగా ఆడియెన్ క‌నెక్ట‌యిపోయారు. ఆరంభం కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా వాట‌న్నిటినీ ఓవ‌ర్ క‌మ్ చేసి జాన్వీ న‌టిగా రాణిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బాలీవుడ్ లో ఉన్న అతికొద్ది మంది ఫ్యాష‌నిస్టాల్లో జాన్వీ క‌పూర్ పాపులారిటీ అసాధార‌ణం.

ఈ బ్యూటీ బాలీవుడ్ లో కొన్ని విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి, టాలీవుడ్ లో దేవ‌ర చిత్రంతో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న ఆరంగేట్ర‌మే అవ‌కాశం అందుకుంది. ఇక జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియా క్వీన్ గాను వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇన్ స్టా వేదిక‌గా జాన్వీ షేర్ చేసే హాట్ ఫోటోషూట్ల‌కు ప్ర‌త్యేక ఫాలోయింగ్ ఉంది.

ఇంత‌కుముందే త‌న స్నేహితుడు ఒర్రీతో క‌లిసి జాన్వీ క‌పూర్ ముంబై మామి ఫెస్టివ‌ల్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. అక్క‌డ ఒర్రీతో క‌లిసి ఫోటోషూట్ లో పాల్గొంది. ఒర్రీ అలియాస్ అవ్ర‌త‌మ‌ణి రిల‌య‌న్స్ సంస్థ‌లో మేనేజ‌ర్ స్థాయిలో ప‌ని చేస్తున్నార‌ని, అత‌డికి స్పెష‌ల్ పోస్ట్ ని డిజైన్ చేసార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. ఇక అవ్ర‌త‌మ‌ణి ఇప్పుడు జాన్వీ క‌పూర్ లేటెస్ట్ ఫోటోషూట్ కి స్పందిస్తూ అద్భుత‌మైన క‌విత‌ను రాసాడు.

డోయ్ కళ్ళు, పింక్ కార్సెట్,

గదిలోకి నడిచాను, నువ్వు నా కళ్లను తడి చేశావని నీకు తెలుసు,

ఇది ఖచ్చితంగా మారి-లిన్ లాంటిది..

నీవు చాలా యవ్వనంగా తాజాగా,

దూరంగా చూడటం హింసించినట్లే అవుతుంది...

అంటూ ఒర్రీ అద్భుత‌మైన క‌విత‌నే రాసాడు. దీనికి అభిమానుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జాన్వీ ఫోటోషూట్ పై సోద‌రుడు అర్జున్ కపూర్ కూడా స్పందించాడు. చివరకు ఎవరైనా ఆమె ట్రెస్‌లను దొంగిలించినప్పుడు.. అంటూ అత‌డు వ్యాఖ్య‌ను జోడించాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ జాన్వీ లుక్ పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తెల్లవారుజామున ఈ స్త్రీల అందాన్ని మనమందరం మెచ్చుకోగలమా! అంటూ ఒక అభిమాని వింత‌గా స్పందించాడు. చాలా అందంగా ఉంది.. సొగసైన వావ్ అంటూ ఒక‌రు.. డ్యామ్ సిజ్లింగ్ అంటూ మ‌రొక‌రు జాన్వీపై అభిమానం కురిపించారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

Tags:    

Similar News