అప్సరను మించే అందమైన మౌనీ.. గ్లామర్ ట్రీట్

నటి మౌనీరాయ్ అందరికీ సుపరిచితమే. ముందుగా హిందీ సీరియల్స్ లో తన కెరీర్ ని మొదలుపెట్టింది.

Update: 2023-09-08 08:49 GMT

నటి మౌనీరాయ్ అందరికీ సుపరిచితమే. ముందుగా హిందీ సీరియల్స్ లో తన కెరీర్ ని మొదలుపెట్టింది. అలానే అందరికీ పరిచయం అయ్యింది. ముఖ్యంగా నాగిని సీరియల్ లో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. నిజంగా నాగిని ఉంటే, తనలానే ఉంటుందా అనేలా తన నటనతో అలరించింది. ఆ తర్వాత నాగినీ కి సీక్వెన్స్ చాలా వచ్చాయి. కానీ, మౌనీ రాయ్ చూపించినంత గ్రేస్ ఇతర నటీమణులు చూపించలేకపోయారు.

ఇలా, సీరియల్స్ లో మెప్పించిన తర్వాత ఆ క్రేజ్ తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. రణవీర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మొదటి భాగంలో ఏకంగా విలన్ పాత్రలో నటించింది. ఈ అందమైన విలన్ కు అందరూ దాసోహమైపోయారు. ఈ మూవీతో ఆమె కేవలం ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, దక్షిణాది ప్రేక్షకులను కూడా అలరించింది. ఇక్కడ కూడా ఆమెకు ఫ్యాన్స్ పెరిగిపోయారు.

కాగా, మౌని రాయ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. బ్లాక్ కలర్ మ్యాక్సీ డ్రెస్ కాగా, కోల్డ్ షోల్డర్స్ డిజైన్ చేసి ఉన్నాయి. ఈ డ్రెస్ ఆమె ఒంటికి అతుక్కుపోయి ఉంది. ఆమె సొగసులు స్పష్టంగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆమె థైస్ మరింత ఆకర్షణీయంగా కనపడుతున్నాయి.


ఇక, తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ కలర్ హై హీల్స్ ధరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. లైకుల వర్షం కురిపిస్తున్నారు. హాట్ , క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, బ్రహ్మాస్త తర్వాత మౌని రాయ్ కి ఆఫర్లు క్యూలు కడుతున్నాయి. ఇటీవల కేజీఎఫ్ లో ఓ స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఇలాంటి మరిన్ని ఆఫర్లు ఆమెకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి ఉంటున్నా, ఇంకా ఆమె అందానికి తగినంత గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. మరి ఫ్యూచర్ లో ఆమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.

Tags:    

Similar News