చూసేందుకు సాదాసీదా దుస్తుల్లో కనిపిస్తూ కొందరు రాజకీయ నాయకులు చాలా సింఫుల్ గా కనిపిస్తారు. తెల్లనివన్నీ పాలు కావన్నట్లే.. సింపుల్ గా కనిపించే సీఎంల ఖర్చు సింఫుల్ గా ఉంటుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విషయానికే వస్తే.. సంప్రదాయ వస్త్రధారణలో ఆయన తెలుగువారందరిని ఆకట్టుకున్నారు. పంచె.. లాల్చీ దుస్తులతో సింఫుల్ గా కనిపించే ఆయన చేతికి పెట్టుకునే వాచీ.. ధరించే చెప్పులు అత్యంత ఖరీదైనవి. ఖరీదైన వస్తువుల ధరించకూడదని చెప్పటం ఇక్కడ ఉద్దేశం కాదు.. పైకి కనిపించేంత సింఫుల్ గా ఉండరని చెప్పటం మాత్రమే ఉద్దేశ్యం.
తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చూసేందుకు ఎంతో సింఫుల్ గా ఉంటారు. సంప్రదాయ దుస్తుల్లో చాలా పొదుపరి అన్నట్లుగా కనిపిస్తారు. కానీ.. ఆయన డ్రెస్సులు కాదు.. కేవలం కండువాలు.. చేతులు తుడుచుకునే టవల్స్.. రుమాలు ఖర్చు చూస్తే కళ్లు తిరగటం ఖాయం.
కర్ణాటకకు చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్తకు ఒక డౌట్ వచ్చింది. సాదాసీదాగా కనిపించే సిద్ధరామయ్య కండవాల ఖర్చు ఎంత ఉంటుందో తెలుసుకోవాలనిపించి.. ఒక దరఖాస్తు నింపి సమాచారహక్కు చట్టం కింద దాఖలు చేశారు. దీనికి సమాధానం రావటం.. వాటిల్లోని అంకెల్ని చూసి ఆశ్చర్యపోవటం సదరు దరఖాస్తుదారుడే కాదు.. దీని గురించి తెలిసిన వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి.
కండువాల ఖర్చు వరకూ చూస్తే.. ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ రూ.4.78లక్షలు ఖర్చు చేసినట్లు తేల్చారు. కండోవాలతో పాటు.. చేతులు తుడుచుకునే తువ్వాలు.. కర్చీఫ్ ల కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తేల్చారు. ఇక.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లో వినియోగించే దుప్పట్లు.. బెడ్ షీట్ల కోసం మరో రూ.4.79లక్షలు ఖర్చు చేసినట్లుగా అధికారిక లెక్కలు చెప్పటం చూసిన వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి. సాదాసీదాగా కనిపించే సీఎంలు సైతం చాలా ఖరీదైనవారేనా..?