జ‌గ‌న్ యూట‌ర్న్‌.. కొత్త మంత్రి వ‌ర్గంలో 10 మంది పాత‌వారికి చోటు!

Update: 2022-04-08 08:30 GMT
ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గ మార్పు...కూర్పుల‌పై రోజుకో ట్విస్ట్ హ‌ల్చ‌ల్ చేస్తోంది. నిముషాని కో వార్త వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఉన్న మంత్రి వ‌ర్గాన్ని రాజీనామా చేయించిన జ‌గ‌న్ ఈనెల 11న కొత్త మంత్రు లతో త‌న కేబినెట్‌ను కొత్త‌గా తీర్చిదిద్ద‌నున్నారు. అయితే.. దీనిలో పాత‌వారికి న‌లుగురుకి అవ‌కాశం ఇస్తా ర‌ని.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు  ప్ర‌చారం జ‌రిగింది. వారి పేర్లు కూడాఇవీ.. అంటూ.. కొన్ని ప్ర‌ధాన మీడియా చానెళ్ల‌లోనే వార్త‌లు వ‌చ్చాయి. స‌హ‌జంగానే ఈ పేర్లు చూసిన త‌ర్వాత‌... సీనియ‌ర్ల‌కు గుబులు రేగింది. మేం సీనియ‌ర్లం.. మమ్మ‌ల్ని కాద‌ని.. జ‌గ‌న్ ఇలా చేయ‌డం ఏంటి? అని వారు లోలోన మ‌ధ‌న ప‌డుతున్నా రు.

మ‌రి ఈ కార‌ణ‌మో.. ఏమో.. తెలియ‌దు కానీ.. ఇప్పుడు జ‌గ‌న్ ఆలోచ‌న‌ల గురించి మ‌రో వార్త తెర‌మీదికి వ‌చ్చింది. ఏకంగా.. 10 మంది పాత మంత్రుల‌ను కొత్త మంత్రి వ‌ర్గంలో కూర్చోబెడుతున్నార‌ని.. తాజాగా వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

పాత మంత్రివ‌ర్గంలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు.. ప్ర‌భుత్వానికి వెన్నుద న్నుగాఉన్న వారిని  కొనసాగించాల‌ని సీఎం నిర్ణ‌యించుకున్న‌ట్టు తాజాగా వార్త‌లు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో దాదాపు పది మందికి మళ్లీ చాన్స్‌ దక్కే అవకాశాలున్నాయ‌ని అంటున్నారు.

పనితీరు, కులాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పాతవారికి మ‌రో అవ‌కాశం ఇవ్వాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీకి అన్ని రూపాల్లో సాయం చేస్తున్న‌.. తాజా మాజీ మంత్రులు.. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణ, కొడాలి నాని(క‌మ్మ‌), పేర్ని నాని(కాపు), సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌, గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌, మైనారిటీ కోటాలో అంజాద్‌ బాషా, ఎస్సీ మ‌హిళా కోటాలో తానేటి వనిత ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగామాజీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ను కూడా కొన‌సాగించ‌నున్నార‌ని స‌మాచారం.

రాబోయే రెండేళ్లు ఇటు ప్ర‌భుత్వానికి, అటు పార్టీకి కూడా చాలా కీల‌క‌మైన స‌మ‌యం. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత క‌ఠినంగా.. ఊహించ‌ని పోటీ ఉంటుంద‌ని భావిస్తున్న నేప‌థ్యంల ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని అన్ని రూపాల్లో ఆదుకున్న కేబినెట్‌లోని సీనియర్లు కొంత‌మందైనా అవసరమనే యోచనలో సీఎం ఉన్నట్లు వైసీపీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది.

కేబినెట్ భేటీ అనంత‌రం.. నిన్న‌.. బొత్స పేషీలో  కొందరు నేతలు ర‌హ‌స్యంగా భేటీ కావడం కీలకంగా మారింది. సచివాలయంలో సజ్జలతో, బొత్స, అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు కన్నబాబు సమావేశమయ్యారు. ఈ నేప‌థ్యంలోనే మంత్రి వ‌ర్గ  కూర్పులో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయ‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News