ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా.. మన దేశంలో కొవిడ్ కు చెక్ చెప్పే వ్యాక్సిన్ ను పెద్ద ఎత్తున ఇస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తాజాగా 100 కోట్ల మార్కును చేరుకోవటం ఇప్పుడు కొత్త చరిత్రగా మారింది. మరి.. ఈ వంద కోట్ల రికార్డు వ్యాక్సినేషన్ లో తెలుగు రాష్ట్రాల వాటా ఏమిటి? దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలు ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
దీనికి సమాధానం వెతికినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. అదే సమయంలో.. చాలా విషయాల్లో దూసుకెళుతున్నట్లు చెప్పే మాటలకు భిన్నంగా తెలుగు రాష్ట్రాల వ్యాక్సినేషన్ ట్రాక్ రికార్డు ఉందన్న మాట వినిపిస్తోంది. దేశంలో టాప్ 5 వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రాల్ని చూస్తే..
1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. పశ్చిమ బెంగాల్
4. గుజరాత్
5. మధ్యప్రదేశ్
ఇది చూస్తే.. టాప్ 5లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా లేకపోవటం గమనార్హం. ఇక.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ర్యాంకు చూస్తే.. ఏపీ 10 స్థానంలో నిలువగా.. తెలంగాణ మాత్రం 13వ ర్యాంకులో ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాల వ్యాక్సినేషన్ ర్యాంకు ఏ మాత్రం బాగోలేదని చెప్పాలి. వంద కోట్ల వ్యాక్సినేషన్ లో ఏ వయసు వారు ఎంత శాతం తీసుకున్నారు అన్నది చూస్తే..
18-44 ఏళ్ల మధ్య వారు 70 శాతం మంది వ్యాక్సిన్ తీసుకుంటే.. 45 - 60 మధ్య నున్న వారు 20 శాతం తీసుకున్నారు. ఇక 60 ప్లస్ వయసు వారు కేవలం 10 శాతం మంది మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి కావటం గమనార్హం. ఇక.. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎపెక్టులు ఎక్కువగా వస్తాయన్న ప్రచారం కూడా టీకా కార్యక్రమానికి ప్రతికూలంగా మారిందని చెప్పాలి. మరి.. టీకా వేసుకున్న వారిలో ప్రతికూలతలు చోటు చేసుకున్న వారు కేవలం 0.005 శాతం మంది మాత్రమేనని చెప్పాలి. మొత్తం వంద కోట్ల వ్యాక్సినేషన్ లో కొవిషీల్డ్ 88 శాతం వాటా అయితే.. కొవాగ్జిన్ 12 శాతంగా చెబుతున్నారు. రష్యాకు చెందిన స్పుత్నిక్ చాలా తక్కువ డోసులే వేసుకోవటం గమనార్హం.