బంగారు తెలంగాణాలో వంద శాతం మొదటి డోసు పూర్తి..!

Update: 2021-12-24 23:30 GMT
టీకా పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. కరోనా కు సంబంధించి ఇవ్వాల్సిన రెండు డోసుల్లో.. మొదటి డోసును విజయవంతంగా రాష్ట్రంలోని 100 శాతం అర్హులైన వారికి వేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మొదటి డోసు టీకాను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాయి. అంతేకాకుండా మరి కొన్ని రాష్ట్రాలు మరో అడుగు ముందుకు వేసి.. రెండో డోసును కూడా వంద శాతం మేర అందించాయి. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వందశాతం అర్హులైన లబ్ధిదారులకు పూర్తి చేయడంతో ఆ రాష్ట్రాల సరసన చేరిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను 100 శాతం పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వైద్యా ఆరోగ్య శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కేవలం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన 337 రోజుల లోపే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ హర్షం వ్యక్తం చేసింది. మన దేశంలో కరోనా వైరస్​ అడుగు పెట్టిన తర్వాత టీకా పంపిణీ కార్యక్రమం అనేది సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత ప్రారంభమైంది. అయితే కొన్ని సాంకేతిక అంశాల కారణంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడానికి కొంత సమయం పట్టింది. ఈ టీకా పంపిణీ కార్యాక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో మందడుగు వేసినన కేసీఆర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది.

ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా కానీ.. తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో టీకా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. చివరికి మొదటి డోసును అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. ఇందుకుగానూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు టీకా పంపిణీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఉండే మారుమూల తండా నుంచి హైదరాబాదు లాంటి మహా నగరం వరకు ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఇందుకుగాను ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి అందరినీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు.

ఇదిలా ఉంటే తెలంగాణ లో రెండో డోసును పూర్తి స్థాయిలో తీసుకున్నవారు 61 శాతం మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొదటి డోసు పంపిణీ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్రమక్రమంగా వాటిని అధిగమిస్తూ రెండో వ్యాక్సినేషన్ ను పూర్తి చేసినట్లు పేర్కొంది. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా పంపిణీ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నట్లు పేర్కొన్నారు. మరి కొద్ది రోజల్లోనే రెండో డోసును కూడా పూర్తి స్థాయిలో అర్హులు అయిన వారికి అందజేయాలని స్పష్టం చేశారు.

ఇటీవల కాలంలో రెండు డోసులను పూర్తి స్థాయిలో ఇచ్చిన రాష్ట్రంగా హిమాచల్​ ప్రదేశ్​ రికార్డు సృష్టించగా.. వ్యాక్సిన్​ ను అందించిన కేంద్ర పాలిత ప్రాంతంగా అండమాన్ నికోబర్ నిలిచింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకోని ప్రజలందరికీ ఉచితంగా టీకా ను పంపిణీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News