మొన్నటి ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. అయితే.. ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి సీట్లు వస్తాయని అందరూ అంచనా వేశారు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ వస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. కొన్ని సర్వేలు టీఆర్ ఎస్ కి - ఇంకొన్ని కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్‌గా వచ్చాయి. కానీ సీన్ కట్ చేస్తే.. టీఆర్ ఎస్ కు బంపర్ మెజారిటీ వచ్చింది.
అయితే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ ఎస్ ఎంతో కష్టపడింది. ఎన్నో వ్యూహాలు పన్నింది. దాని ఫలితమే బంపర్ మెజారిటీ. ఇక వ్యూహాల్లో భాగంగా దాదాపు 10 వేల మంది పోలీస్ - ఐఏఎస్ అధికారుల ఫోన్లను ట్యాప్ చేసిందట టీఆర్ ఎస్. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించింది. పత్రిక కథనం ప్రకారం.. తెలంగాణలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులకు టీఆర్ ఎస్ ప్రభుత్వం మళ్లీ రావడం ఇష్టంలేదట. అందుకే.. పైకి టీఆర్ ఎస్ అంటున్నా లోలోపల మాత్రం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్లు ఎవరో తెలుసుకునేందుకు అనుమానం వచ్చి 10 వేల మంది ఐఏఎస్ - ఐపీఎస్ అధికారుల ఫోన్లను ట్యాప్ చేసిందని ఆ కథనం పేర్కొంటోంది. ఈ ట్యాప్ లో చాలామంది దొంగలుగానే తేలారట. ఇంకొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఇవ్వాల్సిన పోస్టులు కూడా ముందే రిజర్వ్ చేసి పెట్టుకున్నారట.అలాంటివారందర్ని ఇప్పుడు ప్రభుత్వం దరిదాపుల్లోకి రానివ్వడం లేదని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కొంతమంది ఉన్నతాధికారుల దగ్గర ప్రస్తావిస్తే.. ఎన్నికల సమయంలో ఇలా ఫోన్లను ట్యాప్ చేయడం అనేది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియేనని వ్యాఖ్యానించారట.