అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతదేశం సత్తా గురించి అనూహ్యమైన విశ్లేషణ అందింది. ఏకంగా ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన స్థాయిలో ఈ అంచనాలు ఉండటం ఆసక్తికరం. పారిస్ పర్యావరణ ఒప్పందంపై కీలక నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటానని ట్రంప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటం సరైన నిర్ణయం కాదని అమెరికాలోని 11 మంది గవర్నర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కోరారు. ఒకవేళ అమెరికా తప్పుకుంటే, కార్బన్ ఉద్గారాల తగ్గింపుపై వివిధ దేశాలకు చైనా - ఇండియాలు నాయకత్వం వహించే అవకాశం దక్కుతుందని వారు తేల్చిచెప్పారు.
కాలిఫోర్నియా - న్యూయార్క్ - ఒరేగాన్ - వాషింగ్టన్ - పెన్సిల్వేనియా - కొలరాడో - వర్జీనియా - కనెక్టికట్ - హవాయి - డెలావేర్ - రోడీ ఐలాండ్...మొదలైన 11 రాష్ట్రాల గవర్నర్లు ట్రంప్ కు లేఖ రాశారు. పారిస్ పర్యావరణ ఒప్పందం గురించి తమ లేఖలో గవర్నర్లు ఇలా రాశారు...''భూతాపాన్ని తగ్గించాలంటే వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాలు వెలువడకూడదు. ఒప్పందంలోని కీలకమైన అంశమిదే. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా నిలబడితేగానీ ఈ ఒప్పందం విజయం సాధించలేదు. ప్రపంచ దేశాల మధ్య నిర్మాణాత్మక సహకారం లేకుండా ఎంతో వ్యయభరితమైన ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోలేం. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసినా...చైనా, ఇండియాతో సహా ఆర్థికంగా బలమైన దేశాలన్నీ ఒప్పందం అమలుకు చర్యలు చేపడుతున్నాయి. అత్యంత ప్రధానమైన ఇంత పెద్ద కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశాన్ని అమెరికా వదులుకుంటే...చైనా, ఇండియాలు ఆ అవకాశాన్ని దక్కించుకుంటాయి. ఇదెంతమాత్రమూ అమెరికాకు మంచిది కాదు. ఆర్థిక, సాంకేతిక కారణాలతో మనం వెనుకడుగు వేయటం సరైంది కాదు. కార్బన్ ఉద్గారాలను తగ్గించటంపై జాతీయ విధానాల్ని రూపొందించాలి`` అని గవర్నర్లు స్పష్టం చేశారు.
తమ లేఖలో గవర్నర్లు ఇంకా ఏమని చెప్పారంటే...``అమెరికా పౌరులు మంచి గాలి, నీరు లభించాలని కోరుకుంటున్నారు. పారిస్ పర్యావరణ ఒప్పందం తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు తమ పరిశోధనను పెంచాయి. 'క్లీన్ ఎనర్జీ' సాధించటం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. మన ఆర్థిక రంగం పుంజుకుంటోంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఒప్పందం నుంచి వైదొలగాల్సిన అవసరం ఏముంది ?`` అని గవర్నర్లు ప్రశ్నించారు. కాగా, ఒప్పందం నుంచి వైదొలగాల్సిందేనని ట్రంప్ కోరుకుంటున్నా, అన్ని వైపుల నుంచీ విమర్శల తాకిడి ఎక్కువయ్యేసరికి వెనుకాముందు ఆలోచిస్తున్నారు. నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు.
ప్రపంచ ఒప్పందాల్లో అత్యంత చారిత్రాత్మకమైనదిగా చెప్పుకుంటున్న 'పారిస్ పర్యావరణ ఒప్పందం' ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో కుదిరింది. వాతావరణంలోకి కార్బన్ ఉద్గారాల్ని తగ్గించి, భూతాపాన్ని తగ్గించాలన్న ప్రధాన లక్ష్యానికి ఐరాస సభ్య దేశాలన్నీ 2015 డిసెంబర్‌లో అంగీకరించాయి. ఒప్పందంలోని అంశాలు 2020 నుంచి అమల్లోకి రానున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/