ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అది కూడా అత్యంతకీలకమైన శాసనమండలిలోనే! దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు. అయితే.. అదేసమయంలో శాసన సభ ప్రాతినిథ్యం ఉండే.. మరో మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయినా.. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వెనక్కి తగ్గింది. దీంతో ఈ మూడు స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి.
ఇదిలావుంటే.. ఆ మూడు స్థానాలు కాకుండా.. ఇప్పుడు స్థానిక సంస్థల ప్రాతినిథ్యం ఉండే.. మరో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి 20 స్థానాలు స్థానిక సంస్థల కోటాలో మండలిలో ప్రాతినిధ్యం ఉంది. వీటిలో ఇప్పుడు.. కేవలం టీడీపీ నేతలు మాత్రం సభ్యులుగా ఉన్నారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి(2), తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, కడప, అనంతపురం స్థానిక సంస్థల కోటాలో గతంలో ఎన్నికైన.. టీడీపీ నేతలు ఇప్పుడు కొనసాగుతు న్నారు. వీరంగా ఒకేసారి 2023లో రిటైర్ కానున్నారు. ఇక,.. ఇదేసమయంలో మరో 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీగా ఉన్న వాటిలో.. విజయనగరం, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్నా(2), విశాఖ(2), గుంటూరు(2), ప్రకాశం, అనంతపురం జిల్లాలకుచెందిన స్థానిక సంస్తల నుంచి మండలికి సభ్యులను ఎన్నుకోవాలి. ఇప్పుడు.. ఆయా స్థానిక సంస్థలన్నీ కూడా వైసీపీ పరిధిలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ క్రమంలో.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఇక్కడ వైసీపీనే విజయం దక్కించుకోవడం.. ఖాయం. దీంతో వైసీపీ నాయకులు.. వీటిపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన కసరత్తు ఇంకా ప్రారంభం కాకపోవడం.. గమనార్హం. ఎందుకంటే.. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు.. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్లు కూడా అవసరం. అయితే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగినా.. ఫలితాలపై హైకోర్టు స్టే ఉండడంతో మండలి సభ్యుల ఎన్నికల ప్రక్రియకు జాప్యం జరుగుతోంది. సో.. దీంతో ఆశావహులు జగన్ ను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.