2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన `నిర్భయ` గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటన తర్వాత మేలుకున్న కేంద్రం`నిర్భయ`చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆ దుర్ఘటన జరిగి ఐదున్నరేళ్లు కావస్తోన్నప్పటికీ...ఆ దోషులకు ఉరిశిక్ష అమలు కాలేదు. కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లో ఆసిఫా దారుణోదంతం తర్వాత పోక్సో చట్టానికి కేంద్రం సవరణలు చేసింది. ఎన్ని చట్టాలు చేసినా....ఎన్ని శిక్షలు విధించినా ఆ మృగాళ్లలో చలనం కలగడం లేదు. సభ్య సమాజంలో మన మధ్యనే మగాళ్ల రూపంలో ఉన్న మృగాళ్ల కామవాంఛకు ఎందరో అబలలు నేటికీ బలవుతూనే ఉన్నారు. తమ మృగవాంఛ తీర్చుకునేందుకు.....3 నెలల పసిపిల్లల నుంచి 60 ఏళ్ల మహిళల వరకూ...బలి చేస్తున్న దుర్మార్గులు నానాటికీ పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే - చెన్నైలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. సభ్య సమాజం తలదించుకునే రీతిలో ....12 ఏళ్ల బాలికపై 22 మంది...7 నెలల పాటు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన పెను సంచలనం రేపింది. ఎట్టకేలకు ఆ దుర్మార్గుల పాపం పండడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దారుణానికి ఒడిగట్టిన 18 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
చెన్నై పురసైవాక్కంలో 300 ప్లాట్లున్న ఓ భారీ అపార్ట్‌మెంట్ లో 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటోంది. ఆ బాలికపై కన్ను వేసిన 66 ఏళ్ల లిఫ్ట్ ఆపరేటర్ ఆమెకు మత్తు మందిచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బయటి వ్యక్తులైన సెక్యూరిటీ గార్డులు - లిఫ్ట్ ఆపరేటర్ - ప్లంబర్ లతో కూడా ఆ బాలికపై అత్యాచారం చేయించేవాడు. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్స్ - బిస్కెట్లు - మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఆ బాలికపై ఆ 22 మంది పలుమార్లు అత్యాచారం చేశారు. అపార్ట్ మెంట్ లోని ఖాళీ ఫ్లాట్లు - మరుగుదొడ్లు - జిమ్ వంటి నిర్మానుష్య ప్రాంతాలలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడేవారు. అంతకటితో ఆగకుండా ఆ ఘోరాన్ని వీడియోలో చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించి మరీ అత్యాచారం చేసేవారు. రెండు రోజుల క్రితం.....ఢిల్లీలో చదువుకుంటున్న ఆ బాలిక అక్క ఇంటికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వినికిడి లోపం ఉన్న ఆ బాలిక.....7 నెలలుగా తాను అనుభవిస్తున్న నరకం గురించి తన సోదరికి చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు....18మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. రోజూ స్కూల్ నుంచి లేటుగా వస్తోన్న ఆ బాలిక....తన స్నేహితులతో ఆడుకుంటోందని తల్లి భావించింది. కూతురిలో వచ్చిన మార్పులపై ఆమెకు అనుమానం కలగకపోవడం ఆశ్చర్యకరం. దీంతోపాటు, ఆ బాలిక తండ్రి...వృత్తి రీత్యా ఎక్కువ సమయం ఇంట్లో గడపకపోవడం వల్ల బాలికపై నిఘా కొరవడింది. ఇటువంటి మృగాళ్లున్న సమాజంలో....ఆడపిల్లల రక్షణపై తల్లిదండ్రులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.