తమిళనాడు రాజకీయాలు ఇప్పుడెంత రసకందాయంలో పడ్డాయో తెలిసిందే. అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే చీఫ్ శశికళ ఇరువురు పోటా పోటీగా అధికారాన్ని చేజిక్కించుకోవటానికి పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడైతే.. చిన్నమ్మ శశికళకు క్లియర్ కట్ మెజార్టీ కనిపించటం.. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలంతా ఆమె అండర్ లోనే ఉండటం ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఇలాంటి పరిస్థితి ఏర్పడేలా చేయటానికి చిన్నమ్మ భారీ ప్లాన్ నే వేశారని చెబుతున్నారు. అమ్మను అభిమానించే వారంతా పార్టీ ఆఫీసుకు వస్తారన్న సమాచారాన్ని పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వటం.. ఇలాంటి సెంటిమెంట్ ను లక్ష్యపెట్టకపోతే ఇబ్బందన్న భయంతో పార్టీ కార్యాలయానికి వచ్చిన వారికి ఊహించని షాక్ ను చిన్నమ్మ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పార్టీ కార్యాలయానికి వచ్చి.. ఎమ్మెల్యేలతో మాట్లాడి.. సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లుగా చిన్నమ్మ స్వయంగా వెల్లడించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే హైడ్రామా చోటుచేసుకుందని తెలుస్తోంది. చిన్నమ్మ కారులో వెళ్లిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు బయటకు రాలేదు. గంట పాటు పార్టీ కార్యాలయంలోనే ఉంచేసిన అమ్మ బృందం.. ఆ తర్వాత నాలుగు బస్సుల్ని తీసుకొచ్చి.. ఎమ్మెల్యేల్ని ఐదు బృందాలుగా చేసినట్లుగా చెబుతున్నారు.
బస్సుల్ని ఐదు వేర్వేరు హోటళ్లకు తరలించారని.. ఎమ్మెల్యేల వద్ద ఉన్న ఫోన్లను తీసేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకే హోటల్ లో ఉన్నప్పటికీ.. ఒక ఎమ్మెల్యే.. మరో ఎమ్మెల్యేతో మాట్లాడుకునే అవకాశం లేని రీతిలో ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీకార్యాలయానికి వచ్చామని అనుకున్న ఎమ్మెల్యేలకు షాకిస్తూ.. క్యాంప్ కు తరలించటాన్ని ఎమ్మెల్యేలు ఎవరూ ఊహించలేదన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైతే ఎక్కడ ఉన్నారో సమాచారం లేని ఎమ్మెల్యేలు.. బయటకు వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఉత్కంట రేపుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/