175 టార్గెట్.. జగన్ మైండ్ గేమ్ వెనుక అసలు కారణం ఇదే..

Update: 2022-12-30 06:06 GMT
ఏపీలో సార్వ్రతిక ఎన్నికల వెదర్ స్ట్రాట్ అయింది. 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మరోసారి  పీటం దక్కించుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటున్న జగన్ తన వ్యూహాలతో అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు  ప్లాన్ వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన కొత్త అంశాలను తెరపైకి తేనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత ఎపీలో ఎన్నో సమస్యలు సంతరించుకున్నాయి. కానీ ఈ ఐదేళ్ల కాలంలో వాటిని ఎక్కడా గట్టిగా ప్రస్తావించలేదు.

కానీ ఇప్పుడు విభజిత సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేయనున్నారు. విభజన హామీల్లో ఏపీకి రావాల్సి నిధులు కేటాయించాలని ఇప్పటికే జగన్ కేంద్రాన్ని సంప్రదించారు. అయితే జగన్ విభజన హామీల్లో రావాల్సిన డబ్బులు అడుగుతున్నారు. కానీ ఈ హామీల్లోని హక్కుల కోసం పోరాడడం లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు రావడానికి జగన్ మైండ్ గేమ్ తో ముందుకు వెళ్తున్నారని, అందులో భాగంగానే ఈ అంశాన్ని లెవనెత్తుతున్నారన్న చర్చ సాగుతోంది.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనలు చేపట్టింది. పెద్ద నియోజకవర్గాలను చిన్నగా చేసి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచింది. పాత జనాభా లెక్క ప్రాతిపదికన అస్సాం, కాశ్మీర్ లాంటి వాటిల్లో  ఈ ప్రక్రియ పూర్తయింది.

అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లల్లో మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అంతేకాదు.. కావాలనే పునర్విభజన చేయడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. బీజేపీకి ఈ రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాలు లేనందున నియోజకవర్గాల పునర్విభజన చేయడం లేదని అంటున్నారు.

ఈ సమయంలో నియోజకవర్గాల పునర్విభజనపై తెలుగు రాష్ట్రాల్లో అధికార, విపక్షాలు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ నియోజకవర్గాలు పెరిగిపోతే కొన్ని సీట్లను కోల్పోతామోనన్న భయం అధికార, విపక్షాల్లోనూ ఉంది. అందువల్ల ఈ విషయంపై ఎవరూ నోరు మెదపడం లేదు. వాస్తవానికి నియోజకవర్గాలు పెరిగితే ఎమ్మెల్యేలు పెరుగుతారు. ఎమ్మెల్సీలు పెరుగుతారు. కానీ అది వికటిస్తే మనకే ప్రమాదం అని రాజకీయ పార్టీలు వెనుకడుగూ వేస్తున్నాయి.

అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం 175 సీట్లపై గురిపెట్టారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. ఏపీకి నిధులుఇవ్వాలని కోరుతున్నారు. అంటే కేంద్రం నుంచి హక్కులు సాధించాల్సిన అధికార పార్టీ కేవలం నిధులు విడుదల చేస్తే చాలు.. అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఈ నిధులతో అక్కడో ఇక్కడో అభివృద్ధి చేస్తామని చెప్పి మరోసారి అధికారంలోకి రావడానికి యత్నిస్తోంది. ఇలా చేయడంలో జగన్ సక్సెస్ అయితే విభజన సమస్యలు అలాగే కనుమరుగవుతాయి. టీడీపీ సాధించకుండా.. వైసీపీ చేయకుండా ఆ విభజన హామీలు అలాగే ఉండిపోయిన రాష్ట్రానికి ఎప్పటికైనా నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News