అసంతృప్తిని.. నిరసనను వ్యక్తం చేయటానికి పలు మార్గాలు ఉన్నా.. చట్టసభల్లో వెల్‌లోకి దూసుకెళ్లటం కొన్ని పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ప్రచారం కోసం తపించే పార్టీలు ఈ పని ఎక్కువగా చేస్తుంటాయి. తాజాగా జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన తెలిపేందుకు వీలుగా.. ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తున్న వైనం తెలిసిందే.
సభ జరగకుండా అడ్డుకునేందుకు చేసే ఈ ప్రయత్నాన్ని పలువురు తప్పు పడుతుంటారు. ఎంతో సీరియస్ విషయమైతే తప్పించి వెల్ లోకి వెళ్లి నిరసన తెలపటం ఏ మాత్రం మంచి సంప్రదాయం కాదన్న మాటను సీనియర్ రాజకీయ నేతలు చెబుతుంటారు. ఇవాల్టి రోజున దూకుడు రాజకీయాల జోరు పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న అంశాలకు సైతం వెల్ లోకి దూసుకెళ్లటం ఎక్కువైంది.
తాజాగా జరుగుతున్న లోక్ సభ సమావేశాల్లో నిరసన తెలిపే క్ADMK, TDP MPs Suspended From Lok Sabha For Four daysరమంలో నిన్న తమిళనాడు అధికారపక్షానిADMK, TDP MPs Suspended From Lok Sabha For Four daysకి చెందిన అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లటం.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏకంగా 24 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) టీడీపీ ఎంపీలు హోదా సాధన కోసం ఆందోళన చేస్తూ నిరసన చేపట్టారు.
గతంలో వెల్ లోకి వెళ్లి నిరసన చేసినా చూసిచూడనట్లుగా వ్యవహరించారు. అయితే.. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి వెల్ లోకి వెళ్లే వారిపై వేటు వేయాలన్న నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు వెల్ లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టిన ఏపీ అధికారపక్ష ఎంపీలపై నాలుగు రోజుల వేటు వేశారు. హోదా సాధన కోసమంటూ వెల్ లోకి దూసుకెళ్లిన టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. వీరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. పన్నెండు మంది టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు వెల్ లోకి వచ్చిన అన్నాడీఎంకే ఎంపీల్లో తొమ్మిది మందిపై ఈ రోజూ సస్పెండ్ చేశారు.
అనంతరం సస్పెండ్ అయిన ఎంపీలు సభ నుంచి వెళ్లకపోవటంతో సభను రెండు గంటల పాటు వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం.. సస్పెండ్ అయిన ఎంపీలు బయటకు వెళ్లలేదు. సభలోనే ఉండి ఆందోళనల్ని తెలుపుతూ నినాదాలు చేస్తున్నారు. జనవరి ఒకటి నుంచి అమలు చేస్తున్న కొత్త విధానంలో అత్యధిక ఎంపీలపై వేటు పడిన రికార్డు అన్నాడీఎంకేకు వెళ్లగా..ఆ తర్వాతి స్థానంలో తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు.
Full View