అరకు ఎంపీ కొత్తపల్లి గీత బ్యాడ్ టైం కొనసాగుతోంది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఎంపీ గీతకు అనూహ్య రీతిలో ఆమె భర్తకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈమేరకు ఇవాళ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు తీర్పు చెప్పింది. బ్యాంకు రుణం ఎగవేత కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.
విశాఖపట్టణం జిల్లా అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత అనంతరం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం ఆమెపై భూ అక్రమణ ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ పరిధిలోని అత్యంత ఖరీధైన శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ పాన్ మక్తా సర్వే నంబర్ 83లో రూ.5000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఆమె దొంగ పత్రాలు సృష్టించి, ఇవే పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రూ. 25 కోట్ల రుణం తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం చేసిన కేసులో ఆమెపై సీబీఐ కూడా విచారణ జరిపి అభియోగాలను కూడా నమోదు చేసింది. ప్రస్తుతం కొత్తపల్లి గీత తనదిగా పేర్కొంటున్న భూమిపై వివాదం కొనసాగుతోంది. మరోవైపు కొత్తపల్లి గీత అక్రమాలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో ఆమె గతంలో విధులు నిర్వహించిన సమయంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని కలెక్టర్ రఘునందన్ రావును సీఎం ఆదేశించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/