2000 నోటు... నేత‌ల‌కు దెబ్బేసింది !

Update: 2018-05-01 11:09 GMT
మోడీ చెప్పిన హామీల‌పై-వాటిని నెర‌వేర్చ‌క‌పోవ‌డంపై దేశ వ్యాప్తంగా ఎన్నో పార్టీలు, ఎంద‌రో వ్య‌క్తులు ఎన్ని వీడియో సాక్ష్యాలు చూపినా మోడీ తొణ‌క‌ట్లేదు, బెణ‌కట్లేదు. డీమానిటైజేష‌న్‌తో మోడీ మ‌రిచిపోలేని త‌ప్పు చేశార‌ని జ‌నం అనుకుంటున్నారు. కానీ... మోడీ వ్యూహాలు చూస్తుంటే... నోట్ల‌న్నీ త‌న పార్టీ నేత‌ల చేతుల్లో పెట్టడానికే దానిని తీసుకువ‌చ్చిన‌ట్లు కూడా ఎన్నిక‌లు చూస్తుంటే అనిపిస్తోంది.  మోడీ త‌నకు మ‌ర‌క అంట‌కుండా అమిత్ షా నేతృత్వంలో తాను చేయాల‌నుకున్న‌వ‌న్నీ చేస్తూ పోతారు. మాట‌లు మోడీ చెబితే - రాజ‌కీయం అమిత్ షా చేతుల మీదుగా జ‌రుగుతుంది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి క‌ర్ణాట‌క‌లోకి అడుగుపెడుతున్న మోడీ ఎనిమిది రోజుల పాటు అక్క‌డ ప్ర‌చారం చేయ‌నున్నారు. అయితే, ఈసారి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో త‌న ప్ర‌చారం వ‌ల్ల ఏమీ ఒర‌గ‌ద‌ని ఆయ‌నకూ తెలుసు. అందుకే  బీజేపీలోని గాలి వ‌ర్గం, య‌డ్యూర‌ప్ప వ‌ర్గం  జ‌నాల్ని నోట్ల క‌ట్ట‌ల‌తో కొడుతోంది. ఓటుకు నోటు అనేది విచ్చ‌ల‌విడిగా జ‌రుగుతున్నా స్వ‌తంత్ర సంస్థ అయిన ఎన్నిక‌ల సంఘానికి సిబ్బంది లేక ఏమీ చేయ‌లేక‌పోతుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు - మ‌ళ్లీ పాగా వేయ‌డానికి పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఎక్క‌డికి కావాలంటే అక్క‌డికి డ‌బ్బు త‌ర‌లిస్తున్నాయి. దీంతో నోట్ల‌ ప్రభావం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తీవ్రంగా క‌నిపిస్తోంది. మొన్న ఒక్క బ‌స్సులోనే 100 కోట్ల రూపాయ‌లు ప‌ట్టుబ‌డ్డాయంటే ఎంత డ‌బ్బు ఎన్నిక‌ల్లో చేతులు మారుతుందో ఇట్టే అర్థ‌మ‌వుతోంది. కుల -మ‌త రాజ‌కీయాల‌ను డామినేట్ చేసే స్థాయికి వెళ్లిపోయింది ఓటు - నోటు వ్య‌వ‌హారం. ఇపుడు వెయ్యి రూపాయ‌ల నోటు మాయం కావ‌డంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గానీ, డ‌బ్బు క‌ట్ట‌ల మీద ప‌డుకునే రేంజ్ ఉన్న నేత‌ల‌ను క‌లిగి ఉన్న బీజేపీ గాని ఏకంగా రెండు వేలు ఇవ్వ‌డానికి కూడా జంక‌డం లేదు. మోడీ నోట్ల ర‌ద్దు పుణ్య‌మా ఓటు రేటు రెట్టింప‌య్యింది. జేడీఎస్ అధినేత నోటు రేసులో కొంచెం వెనుక‌ప‌డి ఉన్నా ఆయ‌న వ‌ర్గం కూడా ఏం తక్కువ తిన‌లేదు.

మొత్తానికి ద‌క్షిణాదిలో తొడ‌గొట్ట‌డానికి, దేశంలో బీజేపీ హ‌వా త‌గ్గ‌లేద‌ని చెప్ప‌డానికి చీలిక రాజ‌కీయాలు, అసంతృప్త నేత‌ల స‌మీక‌ర‌ణ‌తో పాటు నోట్ల ప్ర‌వాహాన్ని కూడా బీజేపీ క్యాడ‌ర్ విప‌రీతంగా ఎంక‌రేజ్ చేస్తోంది. అంతా బానే ఉంది గాని 2000 వేలు నోటుతో ఓటుకు నోటు బ‌డ్జెట్ పెర‌గ‌డ‌మే నేత‌ల‌కు దెబ్బేసింది.
Tags:    

Similar News