ప్రజల చేతికి కొత్త నోటు వచ్చేసిందోచ్

Update: 2016-11-10 05:35 GMT
అనుకుంటాం కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు జనాలపై ఎంత ప్రభావం చూపిస్తాయన్న విషయం పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ స్పష్టంగా చెప్పేసింది. పెద్దనోట్లను రద్దు చేసేసి.. ఒక రోజు గ్యాప్ తర్వాత కొత్త నోట్లను ప్రజలకు అందుబుటలోకి తీసుకురాన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. తమ దగ్గరున్న డబ్బుల్లో పరిమితంగా మాత్రమే డబ్బులు మార్చుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది.

దక్కిందే మహాభాగ్యంగా భావిస్తున్న ప్రజలు.. బ్యాంకులు ఎప్పుడు తెరుచుకుంటాయా? అన్న అతృతగాఎదురుచూశారు. ఏటీఎంలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చిన క్రమంలో చేతిలో డబ్బులు ఉంచుకోవటం దాదాపుగా తగ్గించిన ప్రజల అలవాటు ఒక సమస్య అయితే.. పెద్ద నోట్లను రద్దు చేయటంతో చేతిలో ఉన్న డబ్బులు పనికి రాక ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముందుగా ప్రకటించిన విధంగానే ఈ రోజు (గురువారం) ఉదయం బ్యాంకులు తెరిచిన వెంటనే.. కొత్త నోట్ల పంపిణీని మొదలు పెట్టారు.

తమ దగ్గరున్న నగదును కొంతమేర అయినా కొత్త నోట్లకు మార్చుకునే వెసులుబాటు కల్పించటంతో జనం బ్యాంకులు.. పోస్టాఫీసులకు పోటెత్తారు. ఉదయం నుంచే బ్యాంకుల ఎదుట క్యూ కట్టారు. బ్యాంకులకు వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించి మరీ బ్యాంకుల లోపలకు సెక్యూరిటీ సిబ్బంది పంపుతున్నారు. కొత్త నోటు పట్టుకొని బయటకు వచ్చిన ప్రజలు విజయగర్వంతో కొత్త నోట్లను చూపిస్తూ బయటకు వెళుతున్న పరిస్థితి. పాతనోట్లను బ్యాంకులకు తీసుకెళుతున్న ప్రజలు కొత్తనోట్లతో బయటకు వస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News